Ayyannapatrudu: జగన్ పాదయాత్ర చేస్తే మహిళలు తరిమికొడతారు
ABN , First Publish Date - 2023-10-08T19:54:02+05:30 IST
జగన్ ఇప్పుడు గనుక ఒకవేళ పాదయాత్ర చేస్తే మహిళలు తరిమికొడతారని మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు(Ayyannapatrudu) ఎద్దేవ చేశారు.
బెంగళూరు: జగన్ ఇప్పుడు గనుక ఒకవేళ పాదయాత్ర చేస్తే మహిళలు తరిమికొడతారని మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు(Ayyannapatrudu) ఎద్దేవ చేశారు. బెంగళూరులో ఆదివారం నాడు సమర శంఖారావం కార్యక్రమానికి టీడీపీ పిలుపునిచ్చింది ఈ కార్యక్రమంలో అయ్యన్న పాత్రుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘‘40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఇంతటి నీచమైన పాలన చూడలేదు. ఇంతటి పచ్చిమోసగాన్ని చూడలేదు. భవిష్యత్తు ఇచ్చిన చంద్రబాబుకు అన్యాయం జరిగిందన్న కసి ఐటీ ఉద్యోగులల్లో ఉంది. మద్యపాన నిషేధం హామీ ఇచ్చి రూ.8 వేల కోట్ల రుణం తెచ్చారు. జగన్‌రెడ్డి వ్యవస్థలను సర్వనాశనం చేశారు. పరిశ్రమలు అన్ని ఏపీ నుంచి పారిపోయాయి. విశాఖపట్నంలో రూ. 45 వేల కోట్లు భూములు కొట్టేశారు. ఎన్నికల సమయంలో ఐటీ నిపుణులు సొంత గ్రామాలకు రండి. రాష్ట్ర పరిస్థికులను ప్రజలకు వివరించండి’’ అని అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు.