KCR: కేసీఆర్ హెల్త్‌పై చంద్రబాబు, పవన్, లోకేశ్ ట్వీట్లు
ABN , First Publish Date - 2023-12-08T14:58:57+05:30 IST
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యంపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు స్పందించారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని

అమరావతి: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యంపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు స్పందించారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని దేవుని ప్రార్థిస్తున్నట్లు చంద్రబాబు ట్వీట్ చేశారు. తగిలిన గాయం త్వరగా మానాలని కోరారు. అలాగే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కూడా కేసీఆర్ ఆరోగ్యంపై స్పందించారు. గాయం నుంచి కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ మేరకు నారా లోకేశ్ ట్వీట్ చేశారు. ఇక జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ కూడా స్పందించారు. ఈ మేరకు పార్టీ ప్రకటన విడుదల చేసింది.
పవన్ ప్రకటన విడుదల..
‘‘కేసీఆర్‌కు గాయమైందని తెలిసి బాధపడ్డాను. సంపూర్ణంగా కోలుకోవాలని దేవుని ప్రార్థిస్తున్నాను. ఎన్నో సవాళ్లను అధిగమించిన ఆయనకు అనారోగ్య పరిస్థితులు మనోధైర్యంతో అధిగమిస్తారనే నమ్మకం ఉంది. పూర్తి స్వస్థత పొంది మళ్లీ ప్రజలకు, సమాజానికి తన సేవలను కొనసాగాలని ఆకాంక్షిస్తున్నాను.’’ అని కోరారు.