Janasena: జమిలీ ఎన్నికలపై ఆసక్తికర వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2023-09-01T18:02:11+05:30 IST
జమిలీ ఎన్నికలపై జనసేన(Janasena) ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. వన్ నేషన్, వన్ ఎలక్షన్ అనే నినాదంతో కేంద్రం కొన్ని చర్యలు తీసుకుంటుందని జనసేన పీఎసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్(Nadendla Manohar) పేర్కొన్నారు.
అమరావతి: జమిలీ ఎన్నికలపై జనసేన(Janasena) ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. వన్ నేషన్, వన్ ఎలక్షన్ అనే నినాదంతో కేంద్రం కొన్ని చర్యలు తీసుకుంటుందని జనసేన పీఎసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్(Nadendla Manohar) పేర్కొన్నారు. శుక్రవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్(Pawan Kalyan)తో ఈ విషయంపై కేంద్ర పెద్దలు చర్చించారన్నారు. వన్ నేషన్, వన్ ఎలక్షన్‌ను జనసేన సమర్ధిస్తుందని చెప్పారు. ఈ అంశంపై లోతైన చర్చ జరగాలి.. ప్రజా ధనం ఆదా అవ్వాలన్నారు. పార్లమెంట్‌లో కూడా జమిలీ ఎన్నికల(Jamili election)పై చర్చ జరిగి, దీనిపై నిర్ణయం జరగాల్సి ఉందన్నారు. దేశం మొత్తం ఒకేసారి ఎన్నిక కావడం వల్ల దేశానికి కూడా మంచి జరుగుతుందని చెప్పారు. జమిలీ ఎన్నికలపై ఎప్పటి నుంచో చర్చ జరుగుతుందన్నారు.కేంద్రంలో ఉన్న నాయకత్వం ఈ అంశాంన్ని బలంగా ముందుకు తీసుకెళ్తుందని.. ఇది మంచి నిర్ణయం.. కాబట్టి మార్పులు చేస్తారని భావిస్తున్నామన్నారు.ఎన్నికలు ఎప్పుడు వచ్చినా జనసేన సిద్ధంగా ఉందన్నారు. ఎన్నికల ద్వారా ఏపీలో కొత్త ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నట్లు వ్యాఖ్యానించారు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ రావాలని భావిస్తున్నామని ఆశాభావం వ్యక్తం చేశారు. సెప్టెంబర్‌లోనే పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ఉంటుందన్నారు. త్వరలోనే మలి విడత వారాహి యాత్ర కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. పొత్తులకు సంబంధించి పవన్ కళ్యాణ్ ఇప్పటికే చెప్పారని.. పరిస్థితులను బట్టి విధివిధానాలు ఉంటాయన్నారు.రాష్ట్రానికి మేలు జరిగేలా, ప్రజా ప్రభుత్వం ఏర్పడేలా జనసేన విధానం ఉంటుందని నాదెండ్ల మనోహర్ తెలిపారు.