Chandrababu: కుప్పం ఏమైనా పాకిస్తానా?

ABN , First Publish Date - 2023-01-05T19:03:47+05:30 IST

కుప్పం (Kuppam) ఏమైనా పాకిస్తానా? అని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ప్రశ్నించారు. దాడులు చేసింది పోలీసులు.. చేయించింది సైకో సీఎం అంటూ ధ్వజమెత్తారు. కుప్పం పోలీసుల లాఠీచార్జ్‌లో పలువురు టీడీపీ నేతలకు గాయాలయ్యాయి.

Chandrababu: కుప్పం ఏమైనా పాకిస్తానా?

చిత్తూరు: కుప్పం (Kuppam) ఏమైనా పాకిస్తానా? అని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ప్రశ్నించారు. దాడులు చేసింది పోలీసులు.. చేయించింది సైకో సీఎం అంటూ ధ్వజమెత్తారు. కుప్పం పోలీసుల లాఠీచార్జ్‌లో పలువురు టీడీపీ నేతలకు గాయాలయ్యాయి. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రికి వెళ్లి టీడీపీ (TDP) నేతలను చంద్రబాబు పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తమపై 1500 మంది పోలీసులతో దాడి చేశారని, పోలీసులతో దాడి చేయించి భయపెట్టాలని చూశారని దుయ్యబట్టారు. ‘‘మాపై దాడి చేసి.. తిరిగి మాపైనే కేసులు పెడుతున్నారు. టీడీపీ నేతలపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. ప్రశాంతంగా ఉన్న నియోజకవర్గంలో అలజడులు సృష్టించారు. పోలీసులు రౌడీల్లా వ్యవహరిస్తున్నారు. పోలీసులు రౌడీల్లా వ్యవహరిస్తున్నారు. మానసికంగా, శారీరకంగా దెబ్బతీయాలని చూస్తున్నారు. మేం కూడా కేసులు పెడ్తాం.. వాస్తవాలు బయటకు రావాలి. ఈ ఉన్మాది సీఎం ఇవాళ ఉంటారు.. రేపు పోతారు. ఈ సీఎం మిమ్మల్ని కూడా జైలుకు పంపిస్తారు. తప్పుడు కేసులు పెట్టిన పోలీసులపై చర్యలు తప్పవు. మాది పార్టీ పోరాటం కాదు.. ప్రజా పోరాటం’’ అని చంద్రబాబు స్పష్టం చేశారు.

Updated Date - 2023-01-05T19:09:07+05:30 IST