కత్తెరతో దాడి

ABN , First Publish Date - 2023-02-14T23:21:48+05:30 IST

తరచూ కడుపునొప్పితో బాధపడుతూ, ఇందుకు కారణం పినతండ్రే అని భావించిన ఓ యువకుడు కత్తెరతో దాడి చేసి గాయపరిచాడు.

 కత్తెరతో దాడి

ప్రొద్దుటూరు క్రైం, ఫిబ్రవరి 14 : తరచూ కడుపునొప్పితో బాధపడుతూ, ఇందుకు కారణం పినతండ్రే అని భావించిన ఓ యువకుడు కత్తెరతో దాడి చేసి గాయపరిచాడు. ఈ ఘటన మంగళవారం రాత్రి జమ్మలమడుగు బస్టాప్‌ సమీపంలోని పెద్దచెట్టు వద్ద చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు బొల్లవరానికి చెందిన కృష్ణ అనే వ్యక్తి జమ్మలమడుగు బస్టాప్‌ వద్ద సోఫాసెట్‌ తయారీ కేంద్రాన్ని నిర్వహిస్తున్నాడు. అతని సోదరుడు రామకృష్ణ కూడా అతని వద్దే ఉంటున్నాడు. కాగా కృష్ణ కుమారుడు సాయికుమార్‌ తనకు కడుపునొప్పి రావడానికి కారణం పినతండ్రి రామకృష్ణనే అని భావించి కత్తెరతో దాడికి పాల్పడ్డాడు. కంటిదగ్గర తీవ్రగాయం కావడంతో వెంటనే చికిత్స నిమిత్తం ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. సాయికుమార్‌ మానసిక పరిస్థితి సరిగా లేదని బంధువులు తెలిపారు. కాగా రామకృష్ణ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం రిమ్స్‌కు ఇక్కడి వైద్యులు రెఫర్‌ చేశారు. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2023-02-14T23:22:01+05:30 IST

News Hub