నాటు సారా తరలిస్తున్న ఐదుగురి అరెస్టు

ABN , First Publish Date - 2023-05-14T23:20:42+05:30 IST

నాటు సారా తరలిస్తున్న ఐదుగురిని ఎస్‌ఈబీ పోలీసులు అరెస్టు చేశా రు.

నాటు సారా తరలిస్తున్న ఐదుగురి అరెస్టు
నాటుసారా తరలిస్తూ పట్టుబడ్డ నిందితులతో ఎస్‌ఈబీ పోలీసులు

మదనపల్లె టౌన, మే 14: నాటు సారా తరలిస్తున్న ఐదుగురిని ఎస్‌ఈబీ పోలీసులు అరెస్టు చేశా రు. శనివారం రాత్రి ఎస్‌ఈబీ ఎస్‌ ఐ అంజాద్‌ బాషా సిబ్బందితో వాహనాలు తనిఖీ చేస్తుండగా నిమ్మనపల్లె మండలం సొమ్మన పల్లె వద్ద ద్విచక్రవాహనంలో 25 లీటర్ల నాటుసారా తరలిస్తున్న టి. శివశంకర్‌, టి.శ్రీనివాసులు, జి.నగే ష్‌ను ఆరెస్టు చేశారు. బోర్డర్‌ పెట్రోలింగ్‌ పోలీస్‌ ఎస్‌ఐ రాజశేఖర్‌ ఆధ్వర్యంలో సీటీఎం పంచాయతీ చిలకవారిపల్లె వద్ద దాడులు నిర్వహిం చగా, టి.యేసు, వై.కళ్యాణ్‌ అనే ఇద్దరు నాటుసారా విక్రయిస్తూ పట్టుబ డ్డారు. వీరిద్దరిని అరెస్టు చేసిన పోలీసులు, వీరికి సారా సరఫరా చేసిన రామకృష్ణపై కేసు నమోదు చేశారు. నిందితులను రిమాండుకు పంపారు.

Updated Date - 2023-05-14T23:20:42+05:30 IST

News Hub