వైసీపీ ఏజెంట్‌లా వ్యవహరిస్తున్న ఎస్‌ఐ
ABN , First Publish Date - 2023-03-24T23:43:05+05:30 IST
పుల్లంపేట ఎస్‌ఐ సుబ్బారెడ్డి వైసీపీ నేతల ఏజెంటుగా వ్యవహరిస్తున్నారంటూ టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు.

టీడీపీ నేతల ఆరోపణ
పుల్లంపేటలో హైవేపై భారీ నిరసన
పుల్లంపేట, మార్చి 24: పుల్లంపేట ఎస్‌ఐ సుబ్బారెడ్డి వైసీపీ నేతల ఏజెంటుగా వ్యవహరిస్తున్నారంటూ టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. టీడీపీ కార్యకర్తలపై వైసీపీ నేతలు దాడులకు పాల్పడు తుంటే.. వారిని అడ్డుకోవాల్సిన ఎస్‌ఐ తమపై దాడులకు పాల్పడు తున్నారంటూ రైల్వేకోడూరు టీడీపీ ఇనచార్జి కస్తూరి విశ్వనాధ నాయుడు ఆధ్వర్యంలో శుక్రవారం పుల్లంపేట బైపాసు రోడ్డులో టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా చేరుకొని నిరసన వ్యక్తం చేశారు. వైసీపీ ఏజెంటు ఎస్‌ఐ డౌనడౌన, గోబ్యాక్ అంటూ నినా దాలు చేశారు. ఈ విషయం తెలిసిన డీఎస్పీ శివభాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో పలువురు సీఐలు, ఎస్‌ఐలు భారీగా పోలీసులు అక్కడకు చేరుకొని టీడీపీ నేతల ఆందోళనను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ ఇనచార్జి విశ్వనాఽథనాయుడు, పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాస రెడ్డి డీఎస్పీ శివభాస్కర్‌రెడ్డితో వాగ్వాదానికి దిగారు. తమకు జరుగుతున్న అన్యాయంపై శాంతియుత నిరసన వ్యక్తం చేయడానికి వస్తే ఎందుకు అడ్డుకుంటారని నిలదీశారు. పుల్లంపేట ఎస్‌ఐ సుబ్బారెడ్డి స్థానిక వైసీపీ నేతల ఏజెంటుగా వ్యవహరిస్తూ టీడీపీ కార్యకర్తలపై దాడులు చేయడం ఏమిటని నిలదీశారు. ఇలా పోలీసులు, టీడీపీ నేతల మధ్య వాగ్వాదం జర గడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో కడప-చెన్నై హైవేపై సుమారు 45 నిమిషాల పాటు ట్రాఫిక్ స్తంభించి పోయింది. ఈ సందర్భంగా కస్తూరి విశ్వనాధనాయుడు మాట్లా డుతూ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడంతో పుల్లంపేటలో తమ నాయకులు, కార్యకర్తలు బాణాసంచా పేలుస్తూ సంబరాలు చేసుకుంటుంటే వైసీపీ కార్యకర్తలు దాడు లకు పాల్పడ్డారన్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఎస్‌ఐ సుబ్బారెడ్డి టీడీపీ నాయకులను, కార్యకర్తలను బెదిరించడం దారుణమన్నారు. పట్టభద్రుల ఎన్నికల్లో కూడా పుల్లంపేట ఎస్‌ఐ ఇష్టానుసారం ప్రవర్తించాడని గుర్తు చేశారు. ఇందుకు డీఎస్పీ మాట్లాడుతూ ఎస్‌ఐపై పూర్తిస్థాయిలో విచారణ చేపడతామని హామీ ఇచ్చారు. ఒకానొక దశలో పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు రోడ్డుపైకి రావడంతో పోలీసులు వారిని అదుపు చేయలేక పోయారు. వరుస ఓటములతో వైసీపీ ప్రస్టేషనలో పడిపోయిందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు శ్రీనివాసులురెడ్డి ఎద్దేవా చేశారు. పోలీసులు న్యాయబద్ధంగా వ్యవహరించాలని గెలిచినప్పుడు సంబ రాలు చేసుకుంటే దాడి చేస్తారా... వారికి పోలీసులు కొమ్ముకాస్తారా అంటూ డీఎస్పీని నిలదీశారు. దీంతో ఇరువర్గాలపై కేసులు నమోదు చేశామంటూ ఎఫ్‌ఐఆర్ కాపీలను డీఎస్పీ శివభాస్కర్‌రెడ్డి వారికి అందజేశారు. దీంతో పరిస్థితి కాస్త సర్దుమనిగింది. అనంతరం కస్తూరి, శ్రీనివాసరెడ్డిలు ఇటీవల వైసీపీ నేతల దాడిలో గాయపడ్డ కేశినేని వెంకటేష్‌ను పరామర్శించి ధైర్యం చెప్పారు. కార్యక్రమంలో మాజీమార్కెట్ కమిటీ చైర్మన రామచంద్ర నాయు డు, పుల్లంపేట మండల పార్టీ అధ్యక్షుడు ఆరే సుధాకర్‌నాయుడు, టీడీపీ నాయకులు కె.కె.చౌదరి, నందవరం సునంద, అనితదీప్తి, పోలూరి కృష్ణమనాయుడు తదితరులు పాల్గొన్నారు.