ప్రజారోగ్యంపై శ్రద్ధ తప్పనిసరి
ABN , First Publish Date - 2023-04-28T00:45:57+05:30 IST
ప్రజారోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని వైద్య ఆరోగ్య సిబ్బందిని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ జె.నివాస్ ఆదేశించారు. జి.కొండూరు పీహెచ్‌సీ ఆధ్వర్యంలోని చెవూటరు వెల్నెస్ సెంటర్‌ను గురువారం సందర్శించారు.
జి.కొండూరు, ఏప్రిల్ 27: ప్రజారోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని వైద్య ఆరోగ్య సిబ్బందిని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ జె.నివాస్ ఆదేశించారు. జి.కొండూరు పీహెచ్‌సీ ఆధ్వర్యంలోని చెవూటరు వెల్నెస్ సెంటర్‌ను గురువారం సందర్శించారు. ఎంఎల్‌హెచ్‌పీ, ఏఎన్‌ఎం రికార్డులు, యాప్‌లను పరిశీలించారు. ఎన్‌సీడీ సీడీ రోగులకు అందుతున్న సేవలను గురించి తెలుసుకున్నారు. గ్రామంలోని జడ్పీ ఉన్నత పాఠశాలను సందర్శించి కౌమారదశలో ఉన్న విద్యార్థులకు అనిమియా నిర్థారణ పరీక్షలు, ఐరన్ పొలిక్ యాసిడ్ మాత్రలు సరఫరా తదితర అంశాలను పరిశీలించారు. జిల్లా వైద్యాధికారిణి ఎం.సుహాసిని, ఎఫ్‌డీపీ కార్యక్రమం అధికారి డాక్టర్ మోతీబాబు, డాక్టర్ మాధవి, డాక్టర్ ఎ.శ్రీకల్యాణి, తదితరులు పాల్గొన్నారు.