Kodi Katti Case.. ఎన్‌ఐఏ కోర్టులో నేడు కీలక విచారణ

ABN , First Publish Date - 2023-04-17T10:31:03+05:30 IST

అమరావతి: కోడి కత్తి కేసు (Kodi Katti Case) విచారణలో భాగంగా సోమవారం ఎన్‌ఐఏ కోర్టు (NIA Court)లో కీలక విచారణ జరగనుంది.

Kodi Katti Case.. ఎన్‌ఐఏ కోర్టులో నేడు కీలక విచారణ

అమరావతి: కోడి కత్తి కేసు (Kodi Katti Case) సోమవారం ఎన్‌ఐఏ కోర్టు (NIA Court)లో కీలక విచారణ జరగనుంది. నిందితుడు తరపున అబ్దుల్ సలీం, ఎన్ఐఏలు దాఖలు చేసిన కౌంటర్‌లపై ఈరోజు సీఎం జగన్ తరపు న్యాయవాది వాదనలు వినిపించనున్నారు. ఈ నెల 13న కౌంటర్ అధ్యయనానికి జగన్ తరపు న్యాయవాది ఇంకొల్లు వెంకటేశ్వర్లు రెండు రోజుల సమయం కోరిన విషయం తెలిసిందే. దీనితో విచారణను ఎన్ఐఏ కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. ఈరోజు వాదనలు వినిపించాలని .. అదేరోజు హియరింగ్ విని ఆర్డర్ ఇస్తానని న్యాయమూర్తి అన్నారు. వాయిదాలు ఇవ్వద్దంటూ గత వాయిదాలో నిందితుడు తరపు న్యాయవాది అభ్యర్థించారు. దీంతో న్యాయస్థానం కేసు విచారణను సోమవారానికి (17వ తేదీ) వాయిదా వేసింది.

ఈ నెల 10న జరిగిన విచారణలో ఈ కేసులో కుట్ర కోణంలో లోతైన విచారణ జరిగేలా ఆదేశించాలని కోరుతూ సీఎం జగన్ పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ 101కి గత వాయిదా రోజు నిందితుడి తరపు న్యాయవాది సలీం, ఎంఐఏ తరపు న్యాయవాది విశాల్ గౌతంలు కౌంటర్‌లు దాఖలు చేశారు. హాజరు మినహాయింపు, అడ్వకేట్ కమిషనర్, నియామకం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ కోరుతూ మరో పిటిషన్ 100ను ఈ నెల 10నే ముఖ్యమంత్రి తరపు న్యాయవాది వేశారు. ఈ పిటిషన్‌పై ఈ నెల 13న జరిగిన విచారణలో నిందితుడి తరపు న్యాయవాది అబ్దుల్ సలీం అభ్యంతరాలు తెలిపారు.

కాగా విచారణ కీలక దశకు చేరుకోవడం.. ఎన్ఐఏ నిందితుడి స్టేట్‌మెంట్‌ను గత వాయిదాలు కోర్టుకు సమర్పించడం.. అవి మరోసారి సంచలనం కావడంతో ఇప్పుడు ఏమి జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. అటు ఈ కేసుపై రాజకీయ వర్గాల్లోనూ హీట్ పెరుగుతోంది.

Updated Date - 2023-04-17T10:31:03+05:30 IST