AP Minister: కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌ను కలిసిన మంత్రి నాగేశ్వరరావు

ABN , First Publish Date - 2023-03-02T15:09:41+05:30 IST

ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌‌తో ఏపీ పౌరసరఫరాలశాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గురువారం భేటీ అయ్యారు.

AP Minister: కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌ను కలిసిన మంత్రి నాగేశ్వరరావు

న్యూఢిల్లీ: ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌‌ (Union Minister Piyush Goyal) తో ఏపీ పౌరసరఫరాలశాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు (Karumuri Nageshwar Rao) గురువారం భేటీ అయ్యారు. అనంతరం ఏపీ మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో పీడీఎస్ కమాండ్ కంట్రోల్ రూమ్ వ్యవస్థను కేంద్రం ప్రశంసించిందని తెలిపారు. జియో టాగ్ సిస్టం ద్వారా ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా చేశామన్నారు. స్మార్ట్ పీడీఎస్ విధానం అమలు చేస్తున్నామని... రైస్ మిల్లులలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, బియ్యం రీ సైకిల్ కాకుండా చేస్తున్నామన్నారు. ధాన్యం కొనుగోలు డబ్బులు మూడు రోజులలో రైతుల ఖాతాలలో వేస్తున్నట్లు చెప్పారు. 1702 కోట్ల రూపాయల పాత బకాయిలు చెల్లింపునకు కేంద్రం అంగీకారం తెలిపిందని మంత్రి వెల్లడించారు.

కేరళ కోసం జయ బొండం బాయిల్డ్ రైస్‌కు కేంద్రం 5 లక్షల మెట్రిక్ టన్నులు ఆర్డర్ ఇచ్చిందని... ఒక లక్ష అంత్యోదయ కార్డుల మంజూరుకు కేంద్రం ఒప్పుకుందని తెలిపారు. రైతుల (AP Farmers) కు ధాన్యం డబ్బులు ఎప్పటికప్పడు ఇస్తున్నామని... కేంద్రం సకాలంలో చెల్లింపులు చేస్తోందన్నారు. రేషన్ కార్డుపై రెండు కిలోల గోధుమ పిండి కూడా ఇస్తున్నట్లు తెలిపారు. వచ్చే రెండు నెలల్లో జొన్నలు, రాగులు కూడా పీడీఎస్ కింద సరఫరా చేస్తామన్నారు. పీడీఎస్ బియ్యం రీ సైక్లింగ్ జరగకుండా దాడులు చేస్తున్నామన్నారు. రేషన్ కార్డులను తొలగించమని స్పష్టం చేశారు. పార్టీలు, కులాలు చూడకుండా పథకాలు ఇస్తున్నామని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు వెల్లడించారు.

Updated Date - 2023-03-02T15:09:41+05:30 IST