Share News

Peetala Sujatha: జగన్ జైల్లో ఉంటే, ఆయన తల్లి.. చెల్లి.. భార్య ఏం చేశారో గ్రహించాలి

ABN , First Publish Date - 2023-10-19T16:29:03+05:30 IST

అమరావతి: టీడీపీ కార్యక్రమాలు.. భువనేశ్వరి, లోకేష్‌ల నిర్ణయాలపై నోరు పారేసుకుంటున్న వైసీపీ మంత్రులు గతంలో జగన్ జైల్లో ఉంటే, ఆయన తల్లి.. చెల్లి.. భార్య ఏం చేశారో గ్రహించాలని మాజీ మంత్రి పీతల సుజాత అన్నారు.

Peetala Sujatha: జగన్ జైల్లో ఉంటే, ఆయన తల్లి.. చెల్లి.. భార్య ఏం చేశారో గ్రహించాలి

అమరావతి: టీడీపీ కార్యక్రమాలు.. భువనేశ్వరి (Bhuvaneswari), లోకేష్‌ (Lokesh)ల నిర్ణయాలపై నోరు పారేసుకుంటున్న వైసీపీ మంత్రులు (YCP Ministers) గతంలో జగన్ (Jagan) జైల్లో ఉంటే, ఆయన తల్లి.. చెల్లి.. భార్య ఏం చేశారో గ్రహించాలని మాజీ మంత్రి పీతల సుజాత (Peetala Sujatha) అన్నారు. ఈ సందర్భంగా గురువారం ఆమె ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ విజయలక్ష్మి (Vijayalakshmi) ఓదార్పుయాత్ర... షర్మిల (Sharmila) పాదయాత్రలు.. ఎందుకు జరిగాయో ఎవర్ని మోసగించడానికి జరిగాయో మంత్రి అంబటి (Minister Ambati) చెప్పాలన్నారు. భువనేశ్వరి ప్రజల్లోకి వస్తోందనగానే ముఖ్యమంత్రికి, మంత్రులకు మతి చలించిందన్నారు. చంద్రబాబు కుటుంబానికి సమాధానం చెప్పలేక, ఆయన తప్పు చేశాడని కోర్టుల్లో నిరూపించలేక... ఏం చేస్తున్నామో, ఏం మాట్లాడుతున్నామో తెలియని స్థితిలో ముఖ్యమంత్రి, మంత్రులు పిచ్చికూతలు కూస్తున్నారని ఆమె మండిపడ్డారు.

వైఎస్ మరణాన్ని తట్టుకోలేక ఆయన అభిమానులు చనిపోయారన్నది అబద్ధమా అంబటి? అని పీతల సుజాత ప్రశ్నించారు. వైఎస్ మరణంతో ఎవరూ చనిపోలేదని.. తన ప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డి ఆనాడు అబద్ధం చెప్పారన్నది అంబటి రాంబాబు అభిప్రాయమా?.. గతంలో జగన్ తల్లి విజయలక్ష్మి సానుభూతి కోసమే ఓదార్పు యాత్ర చేసారా అంబటి?.. జగన్ వదలిన బాణాన్నంటూ అతని చెల్లి షర్మిల ఏ ప్రయోజనాలు ఆశించి పాద యాత్ర చేశారు రాంబాబు? అని నిలదీశారు. సొంత బాబాయ్‌ని చంపిన వ్యక్తిని కాపాడినప్పుడే జగన్ వ్యక్తిత్వం ఏంటో ప్రజలకు అర్థమైందన్నారు. చంద్రబాబు ఏ తప్పూ చేయలేదని, ముఖ్యమంత్రి కక్షతో ఆయన్ని జైలుకు పంపారని ప్రజలు గ్రహించారని పీతల సుజాత అన్నారు.

Updated Date - 2023-10-19T16:29:03+05:30 IST