Chandrababu సీఎం కావాలంటూ దేవాలయాల్లో పూజలు..

ABN , First Publish Date - 2023-04-21T16:52:10+05:30 IST

ప్రపంచ వ్యాప్తంగా టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) జన్మదిన వేడుకలను (Birthday celebrations) ఆ పార్టీ అభిమానులు ఘనంగా నిర్వహించారు.

Chandrababu సీఎం కావాలంటూ దేవాలయాల్లో పూజలు..

Internet Desk: ప్రపంచ వ్యాప్తంగా టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) జన్మదిన వేడుకలను (Birthday celebrations) ఆ పార్టీ అభిమానులు ఘనంగా నిర్వహించారు. కేక్‌లు కట్ చేయడంతోపాటు రక్తదానం (Blood Donation) చేశారు. చంద్రబాబుకు ఆయురారోగ్యాలు కలగాలని, రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రి (Chief Minister) కావాలని కోరుతూ దేవాలయాల్లో పూజలు నిర్వహించారు. మసీదులు, చర్చిలలో ప్రార్థనలు చేశారు.

చంద్రబాబు 73వ జన్మదిన వేడుకలు ఆస్ట్రేలియా (Australia)లోని మెల్బోర్న్ (Melbourne) నగరంలో ఘనంగా జరిగాయి. చంద్రబాబు త్వరలో ముఖ్యమంత్రి కావాలని టీడీపీ ఎన్ఆర్ఐ (TDP NRI)లు ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం (Andhra Pradesh State) సరైన గాడిలో పడాలంటే చంద్రబాబు నాయకత్వం ఎంతో అవసరమని వారు అన్నారు. ‘జై బాబు జైజై బాబు.. సైకో పోవాలి.. సైకిల్ రావాలంటూ నినాదాలు చేశారు’ ఐర్లాండ్‌ (Ireland)లో చంద్రబాబు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కేక్ కటింగ్ చేశారు. చంద్రబాబు నాయకత్వం స్ఫూర్తిదాయకంగా కొనసాగాలని టీడీపీ ఎన్ఆర్ఐలు అన్నారు.

Updated Date - 2023-04-21T16:52:10+05:30 IST