సంక్రాంతి జోష్‌

ABN , First Publish Date - 2023-01-13T01:53:43+05:30 IST

పల్లెసీమలు సంక్రాంతి శోభతో కళకళలాడుతున్నాయి. సంస్కృతి, సంప్రదాయాల మేళవింపు సంక్రాంతి. రంగవల్లులు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు, భోగిపండ్లు, బొమ్మల కొలువులు, భోగిమంటలు, పిండి వంటలు, కోడిపందాలు సందడి గ్రామాల్లో నెలకొంది.

 సంక్రాంతి జోష్‌

కూచిపూడి, జనవరి 12 : పల్లెసీమలు సంక్రాంతి శోభతో కళకళలాడుతున్నాయి. సంస్కృతి, సంప్రదాయాల మేళవింపు సంక్రాంతి. రంగవల్లులు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు, భోగిపండ్లు, బొమ్మల కొలువులు, భోగిమంటలు, పిండి వంటలు, కోడిపందాలు సందడి గ్రామాల్లో నెలకొంది. ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన వారు సొం త ఊళ్లకు రావటం, కొత్త అల్లుళ్ల రాకపోకలు, బంధువుల కలయికతో సంక్రాంతి జోష్‌ కనిపిస్తోంది. మచిలీపట్నం టౌన్‌ : గాంధీబొమ్మ శివాలయంలో దేసు అన్నపూర్ణమ్మ ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీల్లో మహిళలు నైపుణ్యాలను ప్రదర్శించారు. మహిళలకు దేసు అన్నపూర్ణమ్మ, చిట్టెమ్మ బహుమతులు అందజేశారు. నోబుల్‌ కళాశాల ఆవరణలో ప్రిన్సిపాల్‌ ఎర్నెస్ట్‌ ఆధ్వర్యం లో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. గుడివాడ : నందమూరి తారకరామారావు క్రీడా ప్రాంగణంలో స్టేడియం కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలు బుదవారం రాత్రి ఘనంగా ముగిసాయి. జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ ఉప్పాల హారిక ముగ్గుల పోటీల్లో విజేతలకు బహుమతులను అందజేశారు. స్టేడియం కమిటీ ఉపాధ్యక్షుడు పాలేటి చంటి, సంయుక్త కార్యదర్శి పర్వతనేని ఆనంద్‌, మున్సిపల్‌ మాజీ ఛైర్మన్‌ ఎల్‌.ప్రసాదరావు, మున్సిపల్‌ మాజీ ఫ్లోర్‌ లీడర్‌ చోరగుడి రవికాంత్‌, నందివాడ ఎం.పి.పి పెయ్యల ఆదాం తదితరులు పాల్గొన్నారు. ఎస్పీఎస్‌ మున్సిపల్‌ ఉన్నత పాఠశాలలో పురపాలక సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలను గురువారం ఘనంగా ముగిసాయి. విద్యార్థుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. పోటీ ల్లో గెలుపొందిన విజేతలకు మున్సిపల్‌ కమిషనర్‌ పి.జె.సంపత్‌కుమార్‌, అసిస్టెంట్‌ కమిషనర్‌ రంగారావు బహుమతులను అందజేశారు. సచివాలయ సిబ్బంది, మున్సిపల్‌ సిబ్బంది పాల్గొన్నారు. పమిడిముక్కల : తాడంకి పంచాయతీ కార్యాలయంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. చిన్నారులకు బోగిపండ్లు పోశారు. ముగ్గుల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందచేశారు. జడ్పీటీసీ సభ్యురాలు ఏనుగ వెంకట రమణకుమారి, సర్పంచి జంపాన ధనలక్ష్మి, మస్తానరావు, కంభపు రాంబాబు పాల్గొన్నారు.

సంప్రదాయ క్రీడలే మేలు

మోపిదేవి : సంప్రదాయ క్రీడల పట్ల ప్రతి ఒక్కరూ మక్కు వ పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అవనిగడ్డ డిఎస్పీ మెహబూబ్‌ బాషా తెలిపారు. మోపిదేవి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో కబడ్డీ పోటీలను గురువారం ఆయన ప్రారంభించారు. యువకులకు, కబడ్డీ, క్రికెట్‌, మహిళలకు రంగవల్లుల పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కబడ్డీ పోటీల్లో ఘంటసాల, కోసూరువారిపాలెం జట్లు పోటీల్లో తలపడ్డాయి. చల్లపల్లి సీఐ బి.బి.రవికుమార్‌, జడ్పీటీసీ మెడబలిమి మల్లిఖార్జునరావు, సిడిసి ఛైర్మన్‌ రావి నాగేశ్వరరావు, ఎస్‌ఐ పద్మ, సర్కిల్‌ పరిధిలోని పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. గుడివాడ : వీకేకెఆర్‌, వీఎన్‌బీ అండ్‌ ఏజీకే ఇంజనీరింగ్‌ కళాశాలలో వాలీబాల్‌ పోటీలను ఫౌండేషన్‌ అధినేత వెనిగండ్ల రాము ప్రారంభించారు.

Updated Date - 2023-01-13T01:53:45+05:30 IST