Share News

నవరత్నాల పేరుతో మోసం

ABN , First Publish Date - 2023-11-03T01:04:23+05:30 IST

నవరత్నాల పేరుతో సీఎం జగన్‌ ప్రజలను మోసం చేస్తున్నారని బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి విమర్శించారు.

నవరత్నాల పేరుతో మోసం
మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి

బనగానపల్లె, నవంబరు 2: నవరత్నాల పేరుతో సీఎం జగన్‌ ప్రజలను మోసం చేస్తున్నారని బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి విమర్శించారు. పసుపుల గ్రామంలో గురువారం బాబు ష్యూరిటీ..భవిష్యత్తుకు గ్యారెంటీ, రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. బీసీ మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి శూన్యమన్నారు. టీడీపీ హయాంలో చంద్రబాబు గ్రామాలను అభివృద్ధి చేశారన్నారు. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం గ్రామాల్లో రోడ్లు, కాలువలు తదితర కనీస సౌకర్యాల గురించి పట్టించుకోవడం లేదన్నారు. సంక్షేమ పథకాల్లో కోత పెడుతున్నా రన్నారు. రాష్ట్రంలో కరువు పరిస్థితి తీవ్రంగా ఉన్నా రైతులను పట్టించుకోవడం లేదన్నారు. నిత్యావసర ధరలు, విద్యుత్‌, ఆర్టీసీ చార్జీలు పెంచారన్నారు. టీడీపీ శ్రేణులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టారన్నారని, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని అన్నారు. ఇంటింటికి తిరిగి భవిష్యత్తుకు గార్యంటీ కరపత్రాలు పంపిణీ చేశారు. పాతపాడు సర్పంచ్‌ మహేశ్వరరెడ్డి, భూషన్న, షేక్షావలి, కామేశ్‌, గోల్‌నాయక్‌, కళ్యాణ్‌, కృష్ణానాయక్‌, రాజునాయక్‌, బాలనాయుడు, ఆంజనేయులు, జయనాయక్‌, శంకర్‌నాయక్‌, నరసింహుడు, మంగంపేట శ్రీను, నారాయణరెడ్డి, శంఖేశ్వరరెడ్డి, బొబ్బల గోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.

కోవెలకుంట్ల: మండలంలోని చిన్నకొప్పెర్ల గ్రామంలో శుక్రవారం బాబు ష్యూరిటీ.. భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి గురువారం తెలిపారు. సాయత్రం 4 గంటలకు రచ్చబండ సమావేశం నిర్వహిస్తున్నామని చెప్పారు. నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

ప్యాపిలి: వైసీపీ అరాచకాలతో విసుగు చెందిన ప్రజలు ఆ పార్టీని ఇంటికి సాగనంపడం ఖాయమని టీడీపీ నాయకులు ధర్మవరం పెద్దనాగిరెడ్డి అన్నారు. గురువారం పట్టణంలోని 39వ బూత్‌లో బాబు ష్యూరిటీ భవిషత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. పెద్దనాగిరెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం వైసీపీ పాలనలో నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశానంటాయన్నారు. దీంతో పేదలు పస్తులతో కాలం వెళ్లదీయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ పెడుతున్న కష్టాల నుంచి గట్టెఎక్కాలంటే టీడీపీని ఆదరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. చంద్రబాబును గెలుపించుకో వడానికి అందరూ సహకరించాలని కోరారు. టీడీపీ అధికారంలోకి వస్తే ప్రజల సమస్యలను తీరుస్తామన్నారు. నాయకులు చిన్నసుంకయ్య, రామ్మోహన్‌యాదవ్‌, ఎర్రగుంట్లపల్లి వెంకటేశ్వరరెడ్డి, నాగేంద్ర, మల్లికార్జున, గండికోట పెద్దరామాంజినేయులు పాల్గొన్నారు.

Updated Date - 2023-11-03T01:04:24+05:30 IST