Share News

పొట్టి శ్రీరాములుకు ఘన నివాళి

ABN , Publish Date - Dec 16 , 2023 | 12:06 AM

పట్టణంలో టీడీపీ ఆధ్వర్యంలో శుక్రవారం పొట్టి శ్రీరాములు వర్ధంతిని నిర్వహించారు.

 పొట్టి శ్రీరాములుకు ఘన నివాళి
బనగానపల్లెలో నివాళి అర్పిస్తున్న బీసీ రాజారెడ్డి

డోన్‌, డిసెంబరు 15: పట్టణంలో టీడీపీ ఆధ్వర్యంలో శుక్రవారం పొట్టి శ్రీరాములు వర్ధంతిని నిర్వహించారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు సీఎం శ్రీనివాసులు, బీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు ప్రజావైద్యశాల మల్లికార్జున, పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. సీఎం శ్రీనివాసులు, మల్లికార్జునలు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసి అమరజీవిగా పొట్టి శ్రీరాములు ప్రజల హృదయాల్లో నిలిచిపోయారన్నారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా కార్యదర్శి అభిరెడ్డిపల్లె గోవిందు, తెలుగు యువత అధ్యక్షుడు కాశీ విశ్వనాథ్‌, ధను, ఎర్రిస్వామి గౌడు, నరేంద్ర, ప్రవీణ్‌ రెడ్డి, మాధవకృష్ణ, ప్రభాకర్‌ యాదవ్‌, బాషా, బాలకృష్ణ పాల్గొన్నారు.

శిరివెళ్ల: ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలు కోల్పోయిన మహనీయుడు పొట్టి శ్రీరాములు, దేశ స్వాతంత్య్రం కోసం పాటుపడిన సర్దార్‌ వల్లభభాయి పటేల్‌ వంటి త్యాగధనుల సేవలు చిరస్మరణీయమని యర్రగుంట్ల గ్రామ మాజీ సర్పంచ్‌ కమతం పుల్లారెడ్డి కొనియాడారు. అమరజీవి పొట్టి శ్రీరాములు, సర్ధార్‌ వల్లభాయ్‌ పటేల్‌ వర్ధంతి సందర్భంగా స్వామి వివే కానంద చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి శుక్రవారం నివాళి అర్పించారు. కమతం లక్ష్మిరెడ్డి, తాళ్లూరి బుగ్గన్న, మండ్ల పక్కిరయ్య, చింతకుంట్ల రత్నమయ్య, బింగుమళ్ల ప్రభాకర్‌, నల్లగట్ల చిన్న కొండయ్య, మండ్ల హుసేనప్ప, తపసి వెంకటేశ్వర్లు, నాదం, రాముడు, చిన్న లింగమయ్య పాల్గొన్నారు.

చాగలమర్రి: అమరజీవి పొట్టిశ్రీరాములు సేవలు చిరస్మరణీయమని మండల ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు లక్ష్మణబాబు అన్నారు. శుక్రవారం చాగలమర్రిలోని గాంధీ సెంటర్‌ వద్ద పొట్టిశ్రీరాములు విగ్రహం వద్ద నివాళి అర్పించారు. ఆర్యవైశ్య సంఘం నాయకులు, టీఎన్‌టీయూసీ రాష్ట్ర కార్యదర్శి గుత్తి నరసింహులు, ఆవోపా సభ్యులు పాల్గొన్నారు.

బనగానపల్లె: పట్టణంలోని ఆర్యవైశ్య భవనంలో అమరజీవి పొట్టిశ్రీరాములు వర్ధంతిని శుక్రవారం నిర్వహించారు. పొట్టిశ్రీరాములు విగ్రహానికి ఆర్యవైశ్య నాయకులు పూలమాల వేసి నివాళి అర్పించారు. సంఘం పట్టణ గౌరవ అధ్యక్షుడు సుబ్బనారాయణ, పట్టణ అధ్యక్షుడు గాథంశెట్టి వేణుగోపాల్‌ శ్రీరామ వెంకటసుబ్రమణ్యం, కేతేపల్లి శివచంద్రయ్య, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షుడు టంగుటూరు శీనయ్య, డి.వెంకటసుబ్బయ్య, నూకల వెంకటసుబ్బయ్య, గౌరవ సలహాదారు నల్లగట్ల వెంకటేశ్వర్లు, కిశోర్‌, నూకల విజయకుమార్‌, ఆర్యవైశ్య సంఘం జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు సుప్రజ, మురళీధర్‌, తదితరులు పాల్గొన్నారు.

పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో అమరజీవి పొట్టిశ్రీరాములు వర్ధంతిని శుక్రవారం పట్టణ మాజీ సర్పంచ్‌ బీసీ రాజరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పొట్టిశ్రీరాములు చిత్రపటానికి బీసీ రాజారెడ్డి, టీడీపీ వాణిజ్య విభాగం నంద్యాల లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షుడు టంగుటూరు శ్రీనయ్య, తదితరులు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. లాయర్‌ నాగేంద్రరెడ్డి, నాయకులు బత్తుల భాస్కర్‌ రెడ్డి, ఖాదర్‌, జగంశెట్టి, బచ్చు భాస్కర్‌, రామగోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 16 , 2023 | 12:06 AM