Michang Cyclone: ప్రకాశం బ్యారేజి వద్ద గరిష్ఠంగా నీటి మట్టం.. 10 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల
ABN , First Publish Date - 2023-12-06T13:23:06+05:30 IST
మిచాంగ్ తుపాన్(Michang Cyclone) ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో విజయవాడలోని ప్రకాశం బ్యారేజీకి(Prakasham Barraige) వరద పోటెత్తుతోంది.
విజయవాడ: మిచాంగ్ తుపాన్(Michang Cyclone) ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో విజయవాడలోని ప్రకాశం బ్యారేజీకి(Prakasham Barraige) వరద పోటెత్తుతోంది.
ప్రస్తుతం బ్యారేజీ నీటిమట్టం 12 అడుగుల గరిష్ఠానికి చేరింది. దీంతో పది గేట్లు ఎత్తి 6000 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. కాలువలకు సైతం నీటి విడుదలను నిలిపేశారు.