Ambati Rambabu: నన్ను ఆంబోతు అంటే.. చంద్రబాబు ఆంబోతులకు ఆవులను సరఫరా చేసినట్టే.. అంబటి ఫైర్

ABN , First Publish Date - 2023-07-29T13:45:47+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రెస్‌మీట్ పెట్టి తనను ఆంబోతు అన్నారని మండిపడ్డారు. ఎన్టీఆర్ అల్లుడు అవ్వడం మూలంగా చంద్రబాబు ముఖ్యమంత్రి కాగలిగారన్నారు. కిందిస్థాయి నుంచి వచ్చిన తనను ఇష్టానుసారం అంటారా అంటూ విరుచుకుపడ్డారు.

Ambati Rambabu: నన్ను ఆంబోతు అంటే.. చంద్రబాబు ఆంబోతులకు ఆవులను సరఫరా చేసినట్టే.. అంబటి ఫైర్

విజయవాడ: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై (TDP Chief Chandrababu naidu) మంత్రి అంబటి రాంబాబు (Minister Ambati Rambabu) ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రెస్‌మీట్ పెట్టి తనను ఆంబోతు అన్నారని మండిపడ్డారు. ఎన్టీఆర్ అల్లుడు అవ్వడం మూలంగా చంద్రబాబు ముఖ్యమంత్రి కాగలిగారన్నారు. కిందిస్థాయి నుంచి వచ్చిన తనను ఇష్టానుసారం అంటారా అంటూ విరుచుకుపడ్డారు. ‘‘చంద్రబాబు నన్ను ఆంబోతు అన్నప్పుడు ఆయన ఆంబోతులకు ఆవులను సరఫరా చేసినట్టు కలిపి చదువుకోవాలి’’ అంటూ సెటైర్ విసిరారు. ‘‘నీ ఇంటి పేరు నారా కాదు శని ... శని చంద్రబాబు నువ్వు.. వచ్చే ఎన్నికల్లో ప్రజలు దృష్టిలో శనివి నిన్ను వదిలించుకుంటారు’’ అంటూ దుయ్యబట్టారు. పోలవరానికి, రాష్ట్రానికి చంద్రబాబే శని అంటూ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి పోలవరం మీద లేదని.. వచ్చే డబ్బుమీద ఉందన్నారు. తమ వారికి కాంట్రాక్టు ఇస్తే డబ్బులు వస్తాయని చంద్రబాబు పోలవరం చుట్టూ తిరిగారన్నారు. ఆర్ అండ్ ఆర్ రాష్ట్ర ప్రభుత్వం చేయాలంటే చంద్రబాబు వెళ్ళి ప్రెజెంటేషన్ చేస్తే అంగీకరించారా అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదాను వదులుకుని పోలవరం రాష్ట్ర ప్రభుత్వం కడుతుందని చెప్పుకొచ్చారన్నారు. పోలవరం ప్రాజెక్టుకు 2013-14 సంవత్సరం రేట్ల ప్రకారం 2016లో ఒప్పుకున్నాకని.. రూ.20,390 కోట్లకు కడతామని చంద్రబాబు ఒప్పుకున్నట్లు చెప్పారు. చంద్రబాబు పోలవరంను ఏటీఎంగా వినియోగించుకున్నారని కేంద్రం చెప్పిందన్నారు. ఇప్పడు ప్రాజెక్టు రేటు 2017-18 రేట్లు ప్రకారం రూ.55,656 కోట్లు అయ్యిందని మంత్రి తెలిపారు.

ఏటికేడు ప్రాజెక్టు రేటు పెరిగిపోతోందని చెప్పారు. కేంద్రం తీసుకోవాల్సిన ప్రాజెక్టును రాష్ట్రం ఎందుకు తీసుకుందో... చెప్పాలని డిమాండ్ చేశారు. 2018లో పోలవరం చంద్రబాబు పూర్తి చేస్తామన్నారని.. గత ప్రభుత్వంలోని వారంతా కలిసి పోలవరాన్ని ముంచేశారని విమర్శించారు. కాఫర్ డ్యాం కట్టకుండా డయాఫ్రం వాల్ ఎలా వేశారని నిలదీశారు. టీడీపీ హయాంలో పోలవరం 72 శాతం పూర్తిచేశామని అంటున్నారని... పూర్తి చేసింది కేవలం 48.39శాతం మాత్రమే అని తెలిపారు. చంద్రబాబు ఒక అబ్బాయిని అటు... ఇంకో అబ్బాయిని ఇటు పంపి పచ్చి అబద్దాలు ఆడుతున్నారన్నారు. పోతిరెడ్డి పాడు వరకూ రాజశేఖర్‌ రెడ్డి పాదయాత్ర చేశారని.. పోలవరం, పులిచింతలకు రాజశేఖర రెడ్డి శంఖుస్థాపన చేశారని గుర్తుచేశారు.41.15 మొదటి స్టేజి ఎత్తు... త్వరలో కేంద్రం మరో రూ.10 వేల కోట్లు ఇస్తామన్నారన్నారు. డయాఫ్రంవాల్ పరిసర ప్రాంతాల్లో రిపేరుకు రూ.2002 కోట్లు ఇస్తామన్నారని తెలిపారు. 41.15కు మాత్రమే ప్రజెక్టు పూర్తవుతుందనడం కరెక్టు కాదన్నారు. ఆర్ అండ్ ఆర్‌కు ఆలస్యం మూలంగా పెరిగిన మొత్తాన్ని కేంద్రమే బరిస్తుందని మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు.

Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

Updated Date - 2023-07-29T13:45:47+05:30 IST