Share News

Durgamma Temple: దుర్గుగుడిపై అర్చకులను ఇబ్బందులకు గురిచేస్తున్న పోలీసులు

ABN , First Publish Date - 2023-10-16T09:49:47+05:30 IST

ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.

Durgamma Temple: దుర్గుగుడిపై అర్చకులను ఇబ్బందులకు గురిచేస్తున్న పోలీసులు

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అయితే అమ్మవారి సేవలో పాల్గొనే అర్చక స్వాములు మాత్రం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అర్చకస్వాముల పట్ల పోలీసు యంత్రాంగం దురుసుగా ప్రవర్తిస్తోంది. అర్చక స్వాముల కుటుంబాలకు అమ్మవారి దర్శనానికి అనుమతి లేదంటూ.. వచ్చిన వారిని వచ్చినట్టే పోలీసులు వెనక్కి తిప్పి పంపించేస్తున్నారు. పైగా.. అర్చకులను నువ్వు... ఏంటి ... అంటూ ఏకవచనంతో పోలీసులు సంబోధిస్తున్నారు. 365 రోజులు అమ్మవారికి సేవ చేసుకుంటామని.. అలాంటి తమ కుటుంబాలకు దర్శన భాగ్యం లేదా అర్చక స్వాములు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు వారి కుటుంబ సభ్యులను దర్శనాలకు ఎలా తీసుకొస్తున్నారని అర్చకులు ప్రశ్నిస్తున్నారు.


గాయత్రీ దేవిగా...

మరోవైపు ఇంద్రకీలాద్రిపై నవరాత్రి ఉత్సవాలు రెండవ రోజుకు చేరుకున్నాయి. ఈరోజు అమ్మవారు శ్రీ గాయత్రి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. తెల్లవారుజాము నుండే అమ్మవారు గాయత్రి దేవిగా దర్శనం ఇస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు దుర్గగుడికి తరలివస్తున్నారు. పంచ ముఖాలతో ఉండే గాయత్రీ దేవి స్వరూపానికి ఎంతో విశిష్టత ఉంది. సకల మంత్రాలకు మూలమైన శక్తిగా వేదమాతగా ప్రసిద్ధి పొంది ముక్తా విద్రుమ హేమనీల దవళవర్ణాలతో గాయత్రీ దేవి ప్రకాశిస్తుంది. పంచ ముఖాలతో దర్శనమిచ్చే సంధ్యావందన దేవత గాయత్రీదేవి. శిరస్సు యందు బ్రహ్మ, హ్రుదయమందు విష్ణువు, శిఖ యందు రుద్రుడు నివసిస్తుండగా త్రికూర్త్యాంశంగా గాయత్రీ దేవి వెలుగొందుచున్న రూపాన్ని చూసి భక్తులు తరిస్తారు. గాయత్రీ దేవిని దర్శించుకుంటే సకల మంత్ర సిద్ధి ఫలం పొందుతారని విశ్వాసం.

Updated Date - 2023-10-16T09:49:47+05:30 IST