లోకేష్‌కు సంఘీభావం..!

ABN , First Publish Date - 2023-05-06T00:33:52+05:30 IST

ఉమ్మడి జిల్లాకు చెందిన టీడీపీ ముఖ్య నేతలు మరోసారి ఆపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ యువగళంకు సంఘీభావంగా పాదయాత్రలో పాల్గొన్నారు.

లోకేష్‌కు సంఘీభావం..!
పాదయాత్రలో లోకేష్‌తో కలిసి నడుస్తున్న ఉమ్మడి జిల్లా టీడీపీ నేతలు

పాదయాత్రలో పాల్గొన్న గొట్టిపాటి, బీఎన్‌, సత్య

ఒంగోలు, మే 5 (ఆంధ్రజ్యోతి) : ఉమ్మడి జిల్లాకు చెందిన టీడీపీ ముఖ్య నేతలు మరోసారి ఆపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ యువగళంకు సంఘీభావంగా పాదయాత్రలో పాల్గొన్నారు.కుప్పం నుంచి చేపట్టిన పాదయాత్ర 90వ రోజైన శుక్రవారం నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గంలో కొనసాగింది. ఉమ్మడి జిల్లాకు చెందిన అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌, ఎస్‌ఎన్‌పాడు మాజీ ఎమ్మెల్యే బీఎన్‌ విజయ్‌కుమార్‌, పార్టీ యువనేత దామచర్ల సత్యలు అక్కడకు వెళ్లి లోకేష్‌ను కలిశారు.ఆయనతో కలిసి పాదయాత్ర చేశారు. అలాగే మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, టీడీపీ ఒంగోలు పార్లమెంట్‌ ఇన్‌చార్జి బీసీ జనార్దన్‌రెడ్డిలను కూడా వారు కలిశారు.శనివారం కూడా పాదయాత్రలో నడవనున్నారు.

Updated Date - 2023-05-06T00:33:52+05:30 IST