ప్రజలకు వెన్నుపోటు పొడిచిన వైసీపీ

ABN , First Publish Date - 2023-01-03T23:50:33+05:30 IST

అలివిగాని హామీలతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్‌రెడ్డి నిబంధనల పేరుతో సంక్షేమ పథకాలకు కోత పెడుతున్నా రని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నియోజక వర్గ ఇన్‌చార్జ్‌ ముత్తుముల అశోక్‌రెడ్డి విమర్శించారు.

ప్రజలకు వెన్నుపోటు పొడిచిన వైసీపీ

గిద్దలూరు, జనవరి 3 : అలివిగాని హామీలతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్‌రెడ్డి నిబంధనల పేరుతో సంక్షేమ పథకాలకు కోత పెడుతున్నా రని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నియోజక వర్గ ఇన్‌చార్జ్‌ ముత్తుముల అశోక్‌రెడ్డి విమర్శించారు. మండలంలోని అంబ వరం గ్రామంలో మంగళవారం రాత్రి ‘ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమం నిర్వహించారు. పార్టీ శ్రేణులు, ప్రజలతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ప్రజలను కలుసుకుని వారు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా నమోదు చేశారు. ఈ సందర్భంగా అశోక్‌రెడ్డి మాట్లాడుతూ జగన్‌రెడ్డి పాలనలో సంక్షేమ పథకాలకు దూరమై ప్రజలు ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీ హమాంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను రద్దు చేస్తుండడమే కాకుండా ధరలపై అదుపులేదన్నారు. పన్నులు పెంచారని, చార్జీ లు పెంచారని, గ్రామాల్లో చిన్నపాటి సమస్య కూడా పరిష్కరించలేదని పేర్కొన్నారు. కార్యక్రమంలో తెలుగు యువత మండల అధ్యక్షుడు తలారి శ్రీనివాసులు, మాజీ సర్పంచ్‌లు దూదేకుల దస్తగిరి, గుండ్రెడ్డి కుమారి, మాజీ ఎంపీటీసీ సభ్యుడు సుందర్‌రావు, టీడీపీ నాయకులు వీర్ల అల్లూరయ్య, తలారి లక్ష్మమ్మ, పేరం వెంకటేశ్వర్‌రెడ్డి, ఎద్దుల చిన్నవెంకటరెడ్డి, గిద్దలూ రు, రాచర్ల టీడీపీ అధ్యక్షులు సయ్యద్‌ షాన్షావలి, కటికె యోగానంద్‌, యూనిట్‌ ఇన్‌చార్జి గోపాల్‌రెడ్డి, క్లస్టర్‌ ఇన్‌చార్జి వెంకటరెడ్డి, టీఎన్‌టీయూసీ అధ్యక్షుడు బాలచెన్నయ్య, కౌన్సిలర్‌ చంద్రశేఖర్‌యాదవ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-01-03T23:50:35+05:30 IST