Prathipati Pulla Rao: లోకేష్ అమిత్ షాను కలిస్తే వైసీపీకి ఎందుకు భయం?.. జగన్ అలసత్వంతో రైతులకు తీవ్ర నష్టం
ABN , First Publish Date - 2023-10-12T20:15:35+05:30 IST
టీడీపీ యువనేత నారా లోకేష్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిస్తే వైసీపీకి ఎందుకు భయం వస్తోందని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రశ్నించారు.

పల్నాడు జిల్లా: టీడీపీ యువనేత నారా లోకేష్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిస్తే వైసీపీకి ఎందుకు భయం వస్తోందని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రశ్నించారు. నాదెండ్ల మండలం కనపర్రులో బాబుతో నేను కార్యక్రమంలో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. మల్లాయపాలెంలో బీడుగా మారిన పొలాలను ప్రత్తిపాటి పుల్లారావు పరిశీలించారు.
"సీఎం జగన్ అసమర్థతతో పొలాలన్నీ బీడుగా మారాయి. శ్రీశైలం, సాగర్ నీటి వినియోగంపై జగన్‌కు అవగాహన లేదు. సాగునీటి కోసం రైతన్నల కష్టాలు జగన్‌కు కనిపించట్లేదా?. సాగర్ కింద సాగు రైతుల ఆశలన్నీ అడియాశలయ్యాయి. ఓ వైపు కరవు, మరోవైపు జగన్ అలసత్వంతో రైతులకు తీవ్ర నష్టం. లోకేశ్.. అమిత్ షాను కలిస్తే వైకాపాకు ఎందుకు భయం?. అని ప్రత్తిపాటి పుల్లారావు ప్రశ్నించారు.