MLA: కమిటీలు వేసి భూ సమస్యలు పరిష్కరిస్తాం
ABN , Publish Date - Mar 27 , 2025 | 12:19 AM
ప్రతి గ్రామంలో భూ సమస్యలు అధికంగా కనిపిస్తున్నాయని, అసైన్డమెంట్ కమిటీలను ఏర్పాటుచేసి వాటిని పరిష్కరిస్తామని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు. మండలంలోని వెంకటాపురంలో బుధవారం ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ సమస్యలపై ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.

- ప్రజా దర్బారులో ఎమ్మెల్యే పరిటాల సునీత
రామగిరి, మార్చి 26(ఆంధ్రజ్యోతి): ప్రతి గ్రామంలో భూ సమస్యలు అధికంగా కనిపిస్తున్నాయని, అసైన్డమెంట్ కమిటీలను ఏర్పాటుచేసి వాటిని పరిష్కరిస్తామని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు. మండలంలోని వెంకటాపురంలో బుధవారం ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ సమస్యలపై ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. అనంతరం టీడీపీ నాయకులతో సమీక్ష నిర్వహించి గ్రామసమస్యలు తెలుసుకున్నారు. అనంత రం ఎమ్మెల్యే మాట్లాడుతూ... భూ సమస్యల్లో ఎక్కువగా అన్నదమ్ముల పాసు పుస్తకాలు, సరిహద్దు వివాదాలే ఉన్నాయన్నారు. వాటిని గ్రామ పె ద్దల సమక్షంలో పరిష్కరించుకుంటే మంచిదని సూచించారు. గత ప్రభు త్వంలో కక్ష కట్టి పలువురి రేషన కార్డులు తొలగించారని, వాటిని త్వరలో మంజూరు చేస్తామన్నారు. పింఛనల విషయంలో గత వైసీపీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించిందన్నారు. ఇళ్లులేని ప్రతి ఒక్కరికి ఇంటి పట్టాతో పాటు ఇళ్లను మంజూరు చేస్తామన్నారు. ఇటీవల పార్టీ అధిష్టానం తీసుకొచ్చిన కుటుంబ సాధికారత సర్వే కార్యక్రమాన్ని ఈ నెలాఖరులోగా పూర్తి చేయాల్సిన బాధ్యత ఉందన్నారు. కేఎస్‌ఎస్ కార్యక్రమం తరువాత అన్ని కమిటీలను ఏర్పాటుచేస్తామన్నారు.