Share News

Cyclone Effect: భారీ వర్షాలు.. ఏలూరులో కంట్రోల్ రూంల ఏర్పాటు

ABN , First Publish Date - 2023-12-05T14:30:39+05:30 IST

Andhrapradesh: రాష్ట్రంపై మిచౌంగ్ తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉంది. తుఫాను నేపథ్యంలో ఏలూరు జిల్లా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్నటి నుంచి ఎడతెరపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. వర్షాల నేపథ్యంలో ఏలూరు జిల్లాలో అధికారులు కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు.

Cyclone Effect: భారీ వర్షాలు.. ఏలూరులో కంట్రోల్ రూంల ఏర్పాటు

ఏలూరు: రాష్ట్రంపై మిచౌంగ్ తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉంది. తుఫాను నేపథ్యంలో ఏలూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్నటి నుంచి ఎడతెరపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. వర్షాల నేపథ్యంలో ఏలూరు జిల్లాలో అధికారులు కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూమ్‌లను అత్యవసర సహాయం కోసం వినియోగించుకోవాలని కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించారు. నేడు, రేపు భారీ, అతి భారీ వర్షాలు ఉంటాయన్నారు. ప్రజలు అవసరమైతే తప్ప ఇంటిని వదిలి బయటికి రావద్దని అన్నారు. బలహీనంగా ఉన్న ఏటిగట్లు, వంతెనలు, తదితర ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ప్రసన్న వేంకటేష్ వెల్లడించారు.

కంట్రోల్ రూంలు ఇవే..

  • ఏలూరు జిల్లా కలెక్టరేట్ : టోల్ ఫ్రీ నెంబర్ 18002331077

  • నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయం : 08656-232717

  • జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం : 9553220254

  • ఏలూరు ఆర్డీఓ కార్యాలయం: 8500667696

Updated Date - 2023-12-05T14:30:41+05:30 IST