సీసీఎల్ ఛాంపియన్ తెలుగు వారియర్స్
ABN , First Publish Date - 2023-03-26T01:36:52+05:30 IST
తెలుగు వారియర్స్ జట్టు ఈ ఏడాది సెలబ్రటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్) విజేతగా నిలిచింది. శనివారం ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో జరిగిన ఫైనల్స్‌లో భోజ్‌పురి దబాంగ్‌పై తెలుగు వారియర్స్ తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకుంది.
ఫైనల్స్‌లో భోజ్‌పురి దబాంగ్‌పై ఘన విజయం
భోజ్‌పురి బౌలర్లను బెంబేలెత్తించిన అఖిల్ అక్కినేని
విశాఖపట్నం-స్పోర్ట్సు, మార్చి 25:
తెలుగు వారియర్స్ జట్టు ఈ ఏడాది సెలబ్రటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్) విజేతగా నిలిచింది. శనివారం ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో జరిగిన ఫైనల్స్‌లో భోజ్‌పురి దబాంగ్‌పై తెలుగు వారియర్స్ తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకుంది. భోజ్‌పురి దబాంగ్ నిర్దేశించిన 58 పరుగుల విజయలక్ష్యాన్ని తెలుగు వారియర్స్ కేవలం 6.2 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి సునాయాసంగా ఛేదించింది. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో తెలుగు వారియర్స్ కెప్టెన్ అఖిల్ అక్కినేని విధ్వంసకర బ్యాటింగ్‌తో భోజ్‌పురి బౌలర్లను బెంబేలెత్తించాడు. కేవలం 32 బంతుల్లో ఆరు సిక్సర్లు, రెండు బౌండరీలతో 67 పరుగులు చేశాడు.
స్కోర్లు....భోజ్‌పురి దబాంగ్ తొలి ఇన్నింగ్స్...72/6, భోజ్‌పురి దబాంగ్ రెండో ఇన్నింగ్స్...89/6, తెలుగు వారియర్స్ తొలి ఇన్నింగ్స్....104/4, రెండో ఇన్నింగ్స్...58/1