Vishnukumar Raju: ఎంపీ కుటుంబం కిడ్నాప్ వెనుక అనేక అనుమానాలు..

ABN , First Publish Date - 2023-06-17T13:31:59+05:30 IST

విశాఖ: ఏపీ రాష్ట్రంలో రాజకీయం జరుగుతోందని.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలుసుకుంటే బాగుంటుందని బీజేపీ సీనియర్ నేత విష్ణుకుమార్ రాజు అన్నారు. శనివారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ ఎంపీ భార్య, కుమారుడు, ఆడిటర్ జీవిని బంధించి హింసించడం చాలా దారుణమన్నారు.

Vishnukumar Raju: ఎంపీ కుటుంబం కిడ్నాప్ వెనుక అనేక అనుమానాలు..

విశాఖ: ఏపీ రాష్ట్రం (AP State)లో రాజకీయం జరుగుతోందని.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan) తెలుసుకుంటే బాగుంటుందని బీజేపీ (BJP) సీనియర్ నేత విష్ణుకుమార్ రాజు (Vishnukumar Raju) అన్నారు. శనివారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ ఎంపీ భార్య, కుమారుడు, ఆడిటర్ జీవిని బంధించి హింసించడం చాలా దారుణమన్నారు. భగవంతుని దయవల్ల క్షేమంగా బయటపడ్డారని.. రెండు రోజులు వాళ్ళ ఇంట్లో తిష్ట వేయటం. దీనిపై అనేక అనుమానాలు కలుగుతున్నాయన్నారు.

కిడ్నాప్ జరిగితే బంధీలను తీసుకుని వెళతారని, కానీ ఇక్కడ అలా జరగలేదని విష్ణుకుమార్ రాజు అన్నారు. ఏపీ పోలీసులు నిస్పాక్షిక విచారణ జరుపుతారనే నమ్మకం లేదని, దీనిపై రాష్ట్ర పోలీసులతో కాకుండా, థర్డ్ పార్టీతో ఎంక్వయిరీ వేయాలని, సీబీఐ లేదా ఎన్ఐఏతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఆకు రౌడీలు, విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారని, ధర్మార్గులు గంజాయి తాగుతూ మానసికంగా హింసించడం దారుణమన్నారు. ఎంపీ కుమారుడి ఘటన వెనక, కడప, పులివెందుల బ్యాచ్‌లు ఉన్నాయనే ప్రచారం జరుగుతోందన్నారు. నాలుగు రోజుల ముందు నుంచి, ఋషికొండ ప్రాంతంలో సెల్ ఫోన్ డేటా బయటకు తీస్తే మొత్తం వ్యవహారం బయటకు వస్తుందన్నారు.

యూపీ మోడల్ పోలీసింగ్ అమలు చేస్తేనే రాష్ట్రంలో అరాచకాలు తగ్గుతాయని విష్ణుకుమార్ రాజు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎంపీ కుటుంబం కిడ్నాప్ కేసులో కుట్ర దాగి ఉందనే అనుమానం బయట ప్రజల్లో కలుగుతోందన్నారు. విశాఖ ప్రజలతో పాటుగా, హై ప్రొఫైల్ వాళ్ళు కూడా భయపడే పరిస్థితి వచ్చిందన్నారు. విశాఖలో అరాచక శక్తులు తిరుగుతున్నాయని స్వయంగా కేంద్ర హోం మంత్రి హెచ్చరించారన్నారు. గంజాయి మత్తులో జరిగిన అరాచకం గురించి తెలుసుకుని నివ్వెరపోవాలిసి వచ్చిందని, ఎంపీ ఫ్యామిలీకి ఇబ్బంది కలిగితే ప్రతిపక్ష పార్టీలు సంబరాలు చేసుకుంటున్నారని వైసీపీ నాయకులు దిక్కుమాలిన మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇది కిడ్నాప్ కాదు, సెటిల్ మెంట్ వ్యవహారం అనేది తమ అభిప్రాయమని అన్నారు. ఇచ్చుపుచ్చుకునే దగ్గర తేడాలా...? లేక ఇతర కారణాలా...? అనేది విచారించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో సీఎం జగన్ ఓ డిక్టేటర్‌ల వ్యవహరిస్తున్నారని విష్ణుకుమార్ రాజు విమర్శించారు.

Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

Updated Date - 2023-06-17T13:31:59+05:30 IST