జిల్లా ఎస్పీగా విక్రాంత్‌ పాటిల్‌

ABN , First Publish Date - 2023-04-09T00:10:59+05:30 IST

రాష్ట్రంలో భారీగా ఐఏఎస్‌లను బదిలీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం కొంతమంది ఐపీఎస్‌లకు కూడా స్థానచలనం కల్పించింది.

  జిల్లా ఎస్పీగా విక్రాంత్‌ పాటిల్‌
నూతన ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌

పార్వతీపురం, ఏప్రిల్‌ 8(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో భారీగా ఐఏఎస్‌లను బదిలీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం కొంతమంది ఐపీఎస్‌లకు కూడా స్థానచలనం కల్పించింది. ఈ మేరకు శుక్రవారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. దీనిలో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీగా విక్రాంత్‌ పాటిల్‌ నియామకమయ్యారు. ప్రస్తుతం ఎస్పీగా పనిచేస్తున్న విద్యాసాగర్‌నాయుడుకు విశాఖకు బదిలీ అయ్యింది. గతంలో ఉమ్మడి జిల్లాగా ఉన్న సమయంలో విక్రాంత్‌ పాటిల్‌ ఓఎస్‌డీగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన విజయనగరం జిల్లా చింతలవలస 5వ బెటాలిన్‌ కమెండెంట్‌గా పనిచేస్తున్నారు. విజయనగరం జిల్లా ఎస్పీగా ఆయన సతీమణి దీపిక విధులు నిర్వహిస్తున్నారు. గతంలో ఆమె పార్వతీపురం ఏఎస్పీగా పనిచేశారు.

Updated Date - 2023-04-09T00:10:59+05:30 IST