ఘనంగా వేమన జయంతి

ABN , First Publish Date - 2023-01-19T23:46:39+05:30 IST

వేమన పద్యాలు ఎన్నో ఆధునిక పరిశోధనలకు ఆధారం కావటం గొప్పవిషయమని కలెక్టర్‌ సూర్యకుమారి తెలిపారు.

ఘనంగా వేమన జయంతి

కలెక్టరేట్‌: వేమన పద్యాలు ఎన్నో ఆధునిక పరిశోధనలకు ఆధారం కావటం గొప్పవిషయమని కలెక్టర్‌ సూర్యకుమారి తెలిపారు. కలెక్టరేట్‌ ఆడిటో రియంలో గురువారం నిర్వహించిన యోగి వేమన జయంతి వేడుకల్లో ఆ యన చిత్ర పటానికి పూల మాల వేసి నివాళి అర్పించా రు. వేమన గొప్పతనాన్ని కీర్తించారు.

విజయనగరం క్రైం: అందరినీ మెప్పించిన మహా కవి వేమన అని ఎస్పీ దీపికా పాటిల్‌ కొనియాడారు. గురు వారం జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో పోలీసు కార్యా లయంలో వేమన చిత్రపటా నికి పూలమాల వేసి నివా ళులు ఆర్పిం చారు. ఎఆర్‌ అదనపు ఎస్పీ ఎం సోల్‌ మాన్‌, డీఎస్పీలు మోహన రావు, శేషాద్రీ, సీఐలు రాం బాబు, మురళీ, డీపీఓ ఎఈ వెంకట రమణ పాల్గొన్నారు. ఫ బాడంగి: స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో యోగివేమన జయంతి వేడుకలను ప్రిన్సిపాల్‌ ఊద శంకరరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వేమన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులుకు అర్పించారు. ఫ బొబ్బిలి: నారాయణప్పవలస యూపీ పాఠశాలలో హెచ్‌ఎం జేసీ రాజు ఆధ్వర్యంలో వేమన జయంతిని గురువారం నిర్వహించారు. ఆయన చి త్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఫ విజయనగరం రింగురోడ్డు: వేమన శతకాలు, ఆయన రచనలు భవిష్యత్‌ తరాలకు దిక్సూచి లాంటివని నగర మేయర్‌ విజయలక్ష్మి అన్నారు. గురువారం నగర పాలక సంస్థ సమావేశ మందిరంలో వేమన జయంతి వేడు కలను నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

Updated Date - 2023-01-19T23:46:41+05:30 IST