కార్మికుల అక్రమ బదిలీ
ABN , First Publish Date - 2023-03-14T23:40:00+05:30 IST
కార్మికుల అక్రమ బదిలీలపై నిరసనతో సీతానగరం గోద్రెజ్ పామాయిల్ ఫ్యాక్టరీ హోరెత్తింది. సీఐటీయు ఆధ్వర్యంలో సోమవారం రాత్రి చేపట్టిన ఆందోళన మంగళవారం కూడా కొనసాగించారు.

సీతానగరం పామాయిల్ ఫ్యాక్టరీ గేటు వద్ద ఆందోళన
చింతలపూడి, మార్చి 14: కార్మికుల అక్రమ బదిలీలపై నిరసనతో సీతానగరం గోద్రెజ్ పామాయిల్ ఫ్యాక్టరీ హోరెత్తింది. సీఐటీయు ఆధ్వర్యంలో సోమవారం రాత్రి చేపట్టిన ఆందోళన మంగళవారం కూడా కొనసాగించారు. పామాయిల్ ఫ్యాక్టరీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, అక్రమ బదిలీ లు నిలిపివేయాలని గేటు వద్దే వంటావార్పు నిర్వహించారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డీఎన్‌వీడీ.ప్రసాద్ మాట్లాడుతూ 2012 నుంచి సుమారు 400 మంది కార్మికులు పనిచేస్తున్నారని, కార్మిక చట్టాలు అమలుకావడం లేదని ఆరోపించారు. వెట్టిచాకిరి చేయించుకుని, అన్యాయం పై ప్రశ్నించిన వారిని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారన్నారు. ప్రస్తుతం ఐదుగురు కార్మికులపై బదిలీ వేటు వేశారని, వాటిని నిలిపివేయాలని, కనీస వేతనాలు అమలు చేయాలని, సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. సీఐటీయు నాయకులు ఆర్.వి.సత్యనారాయణ, మొడియం నాగమణి, వై.సాయికిరణ్, నత్తా వెంకటేశ్వరరావు, పలువురు నాయకులు మాట్లాడారు.