Yanamala : జనం నమ్మట్లేదనే జగన్ మారీచ జిత్తులు
ABN , First Publish Date - 2023-04-07T12:08:07+05:30 IST
జనం నమ్మట్లేదనే ఏపీ సీఎం జగన్ మారీచ జిత్తులు మళ్లీ ప్రారంభించారని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు.
అమరావతి : జనం నమ్మట్లేదనే ఏపీ సీఎం జగన్ మారీచ జిత్తులు మళ్లీ ప్రారంభించారని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. దేశంలోనే ఇంత ఫెయిల్యూర్ సీఎం ఎక్కడా లేడన్నారు. సొంత పార్టీలోనే అంతర్గత తిరుగుబాట్లతో దిక్కుతోచని స్థితి ఏర్పడిందన్నారు. పంజాబ్‌లా మారిందనే ప్రధాని మోదీ వ్యాఖ్యలే నిదర్శనమన్నారు. రామ రాజ్యం కన్నా రాక్షస రాజ్యంపైనే జగన్‌కు మోజెక్కువన్నారు. అందుకే ఒంటిమిట్ట రాములోరి కల్యాణానికి ఎగ్గొట్టాడని యనమల పత్రికా ప్రకటనలో యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు.