Viveka Murder Case : ముగిసిన అవినాష్‌రెడ్డి సీబీఐ విచారణ.. బయటికొచ్చాక ఎంపీ ఏమన్నారంటే..
ABN , First Publish Date - 2023-01-28T20:03:01+05:30 IST
తెలుగు రాష్ట్రాల్లో పెనుసంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో (Viveka Murder Case) వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి...
తెలుగు రాష్ట్రాల్లో పెనుసంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో (Viveka Murder Case) వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి (YS Avinash Reddy) సీబీఐ (CBI) ఎదుట హాజరయ్యారు. ఎంపీని నాలుగన్నర గంటలపాటు సీబీఐ అధికారులు ప్రశ్నించారు. వివేకా మరణం తర్వాత జరిగిన పరిణామాలపై సీబీఐ విచారణ జరిపింది. ఎంపీ స్టేట్మెంట్‌ను అధికారులు రికార్డు చేసుకున్నారు. విచారణ తర్వాత సీబీఐ కార్యాలయం నుంచి బయటికొచ్చిన అవినాష్ మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
విచారణ తర్వాత..!
సీబీఐ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పానన్నారు ఎంపీ. సీబీఐకు అన్ని విధాలా సహకరిస్తానని మరోసారి స్పష్టం చేశారాయన. కొంతమంది దర్యాప్తును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని అవినాష్ ఆరోపించారు. అవసరమైతే విచారణకు మరోసారి పిలుస్తామని అధికారులు చెప్పారన్నారు. అడ్వకేట్‌ను విచారణ గదిలోకి అనుమతించలేదని ఎంపీ చెప్పారు. తనపై కుట్రపూరితంగా చేస్తున్న పనే ఇదంతా అని ఆయన అన్నారు.
విచారణకు ముందు..
మరోవైపు.. ఇవాళ విచారణకు సీబీఐ ఆఫీసుకు వెళ్లిన అవినాష్ వెంట భారీగా అనుచరులు, కార్యకర్తలు తరలివచ్చారు. దీంతో సీబీఐ ఆఫీస్ (CBI Office) వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. కోఠీలోని సీబీఐ కార్యాలయం దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. మధ్యాహ్నం 3గంటలకు అధికారుల ఎదుట ఎంపీ హాజరయ్యారు. సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్ (CBI SP Ramsingh) ఆధ్వర్యంలో విచారణ జరుగుతోంది. మరోవైపు.. ఆయన తరపు లాయర్‌లను (Lawyers) విచారణ గదిలోకి సీబీఐ అనుమతించలేదు. న్యాయవాది సమక్షంలో సీబీఐ విచారణ జరగాలని మొదట్నుంచీ అవినాష్‌తో పాటు వైసీపీ నేత (YSRCP Leaders) లు డిమాండ్ చేస్తున్నారు.