PMJJBY: ఈ కేంద్ర ప్రభుత్వ బీమా పథకం గురించి చాలామందికి తెలియదు.. జస్ట్ రూ.436 చెల్లిస్తే..
ABN , First Publish Date - 2023-08-17T22:00:06+05:30 IST
సామాన్యుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం పలు రకాల పథకాలను తీసుకొచ్చింది. అందులో జీవిత బీమాకు సంబంధించిన ప్రధాన మంత్రి జీవన జ్యోతి బీమా యోజన. మహత్తరమైనది. కేవలం రూ.436 చెల్లిస్తే రూ.2లక్షల ప్రమాద బీమా కవరేజీ ఉంటుంది. సామాన్యులకు సైతం తక్కువ అందుబాటులో ఉండాలని తక్కువ ప్రీమియంతో కేంద్ర ప్రభుత్వం 2015లో ఈ ప్రధానమంత్రి జ్యోతి బీమా యోజనను తీసుకొచ్చింది. పాలసీ తీసుకున్న వ్యక్తి మరణించిన సందర్భంలో నామినీకి రూ.2లక్షల ఇన్సూరెన్స్ సొమ్ము అందుతుంది.

18ఏళ్ల నుంచి 50ఏళ్ల మధ్య అర్హులు
ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన పథకంలో చేరేందుకు 18ఏళ్ల నుంచి 50ఏళ్ల వయసున్న వారు అర్హులు. బ్యాంకు, పోస్టాఫీసుల్లో పొదుపు ఖాతా ఉన్న వారెవరైనా ఇందులో చేరవచ్చు. ఇందుకోసం బ్యాంక్ ఖాతాను ఆధార్‌తో అనుసంధానించి, నో యువర్ కస్టమర్ పూర్తిచేయాలి. ఒక వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ పొదుపు ఖాతాలు ఉంటే, ఏదైనా ఒక పొదుపు ఖాతా ఉన్న బ్యాంకు నుంచి మాత్రమే ఈ పథకంలో చేరాలి. ఎవరైనా రెండు అకౌంట్ల ద్వారా నమోదు చేసుకుని ప్రీమియం చెల్లించినా ఒకటి మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. ఉమ్మడి ఖాతా తీసుకున్న వారు కూడా ఈ పథకంలో చేరవచ్చు. ఇద్దరూ విడివిడిగా ప్రీమియం డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.
ఈ పథకంలో ఏడాది కాలపరిమితి
ఏడాది కాల పరిమితితో ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. జూన్ 1నుంచి మే 31వరకు అమల్లో ఉంటుంది. ఒకసారి ఇందులో చేరిన వారికి మే 25-31మధ్య ప్రీమియం మొత్తం ఆటో డెబిట్ ద్వారా రెన్యూవల్ అవుతుంది. ఒకవేళ క్యాన్సిల్ చేయాలనుకుంటే రద్దుకోసం బ్యాంకుకు దరఖాస్తు చేసుకోవాలి. కొత్తగా ఈ పథకంలో చేరేవారికి జూన్ 1నుంచి మే 31వరకు కవరేజీ లహాస్తుంది. ఈ పథకంలోకి కొత్తగా చేరినా లేదా తిరిగి జాయిన్ అయిన వ్యక్తి ఏ కారణం చేతనైనా మరణిస్తే నమోదు చేసుకున్న 30 రోజుల తర్వాత మాత్రమే క్లెయిమ్‌కు అనుమతి ఉంటుంది.
గతంలో రూ.330 కాగా ఇప్పుడు రూ.436
తొలుత రూ.330తో ప్రీమియంతోనే పాలసీని అందించేవారు. ఇప్పుడు ఈ ప్రీమియంను రూ.436కు పెంచారు. ఆటో డెబిట్ ద్వారా బ్యాంకు, పోస్టాఫీసు అకౌంటు నుంచే వాయిదాలో ప్రీమియం మొత్తాన్ని చెల్లించాలి. ఈ స్కీమ్‌లో చేరే నెలను అనుసరించి ప్రీమియం మారుతూ ఉంటుంది. ఇది మొత్తంగా టర్మ్ పాలసీ కావడంతో మెచ్యూరిటీ ప్రయోజనాలు ఉండవు. పాలసీదారుడు మరణించినప్పుడు మాత్రమే నామినీకి హామీ మొత్తం చెల్లిస్తారు. ప్రీమియంను బట్టి సొమ్ము బీమా పరిహారంగా లభిస్తుంది. ఆత్మహత్య చేసుకున్న సందర్భాల్లో ఈ స్కీం వర్తించదు.