షాదీఖానా నిర్మాణపనులు ప్రారంభం
ABN , First Publish Date - 2023-06-24T22:38:15+05:30 IST
కల్లూరులో ప్రభుత్వం తరుపున మంజూరైన షాదీఖానా నిర్మాణ పనులను శనివారం ముస్లిం మతపెద్దల సమక్షంలో ప్రారంభించారు. ఇటీవల ఈ షాదీఖానా నిర్మాణ పనులు ప్రారంభించేందుకు పంచాయతీరాజ్ శాఖ అధికారులు సిద్ధం కాగా మరో వైపున ఈ స్థలం తమదేనంటూ తల్లాడ రేంజ్ అటవీశాఖ అధికారులు అభ్యంతరం వ్చక్తం చేశారు.

కల్లూరు, జూన్ 24: కల్లూరులో ప్రభుత్వం తరుపున మంజూరైన షాదీఖానా నిర్మాణ పనులను శనివారం ముస్లిం మతపెద్దల సమక్షంలో ప్రారంభించారు. ఇటీవల ఈ షాదీఖానా నిర్మాణ పనులు ప్రారంభించేందుకు పంచాయతీరాజ్ శాఖ అధికారులు సిద్ధం కాగా మరో వైపున ఈ స్థలం తమదేనంటూ తల్లాడ రేంజ్ అటవీశాఖ అధికారులు అభ్యంతరం వ్చక్తం చేశారు. దీంతో ఈ స్ధలం వివాదస్పందంగా మారింది. ఈ విషయంపై ఇటీవల ఆంధ్ర జ్యోతిలో ప్రచురితమైన కథనంపై కలెక్టర్, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య స్పందించారు. షాదీఖానాకు కేటాయించిన స్థలం గ్రామకంఠమని, స్థానిక రెవిన్యూ అధికారులు క్షేత్ర స్థాయిలో గుర్తించారు. ఆ ప్రకారం షాదీఖానా నిర్మాణ పనులు చేపట్టాలని ముస్లిం పెద్దలకు సూచించారు. ఎవరైన ఆ ప్రదేశం మీదకు వస్తే మండల రెవెన్యూ అధికారులు అప్రమత్తంగా ఉండి, పనులకు అటకంలేకుండా చూడాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో రెవెన్యూశాఖ తరుపున ఆ స్థలానికి గాను హక్కుపత్రాలు ఉండటంతో పీఆర్ శాఖ తరుపున ఎట్టకేలకు షాదీఖానా నిర్మాణం పనులు చేపట్టారు. కార్యక్రమంలో కోఆప్షన్ సభ్యులు ఎండి ఇస్మాయిల్, కమ్లీ మండల ముస్లిం కమిటీ అధ్యక్షుడు సయ్యద్‌ఆలీ, మసీద్ కమిటీ అధ్యక్షుడు షేక్ ఇమామ్, సయ్యద్ ఇషాక్ పాల్గొన్నారు.