'Mukab' in Saudi Arabia: సౌదీ అరేబియాలో అద్భుతం ‘ముకాబ్‌’!

ABN , First Publish Date - 2023-02-21T03:37:40+05:30 IST

రియాధ్‌, ఫిబ్రవరి 20: సౌదీ అరేబియా తన రాజధాని రియాధ్‌లో ముకాబ్‌ పేరిట ఒక అద్భుత నిర్మాణాన్ని త్వరలో చేపట్టనుంది.

'Mukab' in Saudi Arabia: సౌదీ అరేబియాలో అద్భుతం ‘ముకాబ్‌’!

రియాధ్‌, ఫిబ్రవరి 20: సౌదీ అరేబియా తన రాజధాని రియాధ్‌లో ముకాబ్‌ పేరిట ఒక అద్భుత నిర్మాణాన్ని త్వరలో చేపట్టనుంది. న్యూ మురబ్బా పేరిట నిర్మిస్తున్న నగరంలో ఈ ముకాబ్‌ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. అరబ్‌ న్యూస్‌ వెల్లడించిన వివరాల ప్రకారం.. న్యూయార్క్‌లోని ఎంపైర్‌ స్టేట్‌ భవనానికి 20 రెట్లు పెద్దదిగా, 400 మీటర్ల ఎత్తులో చతురస్రాకారంలో ముకాబ్‌ ఉండనుంది. ఇందులోనే పురావస్తు ప్రదర్శనశాల, సాంకేతిక-డిజైన్‌ విశ్వవిద్యాలయం, మల్టీపర్పస్‌ థియేటర్‌ ఉంటాయి. న్యూ మురబ్బా విషయానికొస్తే, ఇది 2.5 కోట్ల చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో రూపుదిద్దుకోనుంది. 1.04 లక్షల నివాస గృహాలు, 9వేల హోటల్‌ గదులు, 9.80 లక్షల చదరపు మీటర్ల మేర దుకాణాల ప్రాంతం, 14 లక్షల చదరపు మీటర్లలో కార్యాలయాలు, 6,20 లక్షల చదరపు మీటర్లలో వినోద ఏర్పాట్లు ఉండనున్నాయి. 2030 కల్లా దీన్ని పూర్తి చేయనున్నారు.

Updated Date - 2023-02-21T03:37:41+05:30 IST