Cow Hug Day: ఇకపై ఫిబ్రవరి 14న ఏం చేయాలంటే?

ABN , First Publish Date - 2023-02-08T21:49:17+05:30 IST

ఇకపై ఫిబ్రవరి 14ను గోమాతల ఆలింగనం రోజుగా (Cow Hug Day) పాటించాలని కేంద్ర

Cow Hug Day: ఇకపై ఫిబ్రవరి 14న ఏం చేయాలంటే?
Cow Hug Day

న్యూఢిల్లీ: ఇకపై ఫిబ్రవరి 14ను గోమాతల ఆలింగనం రోజుగా (Cow Hug Day) పాటించాలని కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమల శాఖ సూచించింది. గోవులను ఆలింగనం చేసుకోవడం ద్వారా ఆనందానుభూతి కలుగుతుందని ఇప్పటికే అనేక పరిశోధనల్లో తేలింది. విదేశాల్లో గోమాతల ఆలింగానానికి డాలర్లు కూడా వసూలు చేస్తున్నారు. గోవుల సమక్షానికి వెళ్తే పాజిటివ్ ఎనర్జీ వస్తుందని కూడా పరిశోధనల్లో తేలింది. ఆవు పాలు శ్రేష్ఠమని కూడా వైద్యులు చెబుతుంటారని గోమాత ఎక్కడ పూజింప బడుతుందో అక్కడ సిరిసంపదలు విరాజిల్లుతాయని కేంద్ర పశు సంవర్ధక బోర్డ్ తెలిపింది. భారత సంస్కృతికి, గ్రామీణ భారతానికి వెన్నెముకలా గోమాత నిలుస్తుందని అభిప్రాయపడింది. గో మూత్రం కీటక నాశినిగా పనిచేస్తుంది. ఆవు పేడలో క్రిములను నాశనం చేసే శక్తి ఉంది. గోవు పాలు, పెరుగు, నెయ్యిలో ఔషధ గుణాలుంటాయి. తల్లిపాలు లేని వారికి ఆవుపాలు పట్టిస్తుంటారు. ఆవు పాలు ఉదర సంబంధమైన జబ్బులు తగ్గిస్తాయి.

వాస్తవానికి కొన్ని సంవత్సరాలుగా ఫిబ్రవరి 14ను పాశ్చాత్య దేశాల్లో వ్యాలంటైన్స్‌డే (Valentines Day)గా జరుపుకుంటున్నారు. భారత దేశంలో కూడా వ్యాలంటైన్స్ డేను ప్రేమికుల రోజుగా జరుపుకుంటున్నారు. అయితే మన భారత సంస్కృతికి, వ్యాలంటైన్స్‌డేకి ఏ మాత్రం సంబంధం లేదని సంప్రదాయవాదులు చెబుతుంటారు.

Untitled-16.jpg

Updated Date - 2023-02-08T22:07:58+05:30 IST