Congress : కాంగ్రెస్‌కు భారీ షాక్... అత్యంత కీలక నేత రాజీనామా...
ABN , First Publish Date - 2023-02-23T12:00:46+05:30 IST
భారత దేశ తొలి గవర్నర్ జనరల్ సీ రాజగోపాలాచారి (C Rajagopalachari) మునిమనుమడు సీఆర్ కేశవన్ (C R Kesavan) కాంగ్రెస్ పార్టీకి
న్యూఢిల్లీ : భారత దేశ తొలి గవర్నర్ జనరల్ సీ రాజగోపాలాచారి (C Rajagopalachari) మునిమనుమడు సీఆర్ కేశవన్ (C R Kesavan) కాంగ్రెస్ పార్టీకి గురువారం రాజీనామా చేశారు. ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge)ను ఉద్దేశించి రాసిన రాజీనామా లేఖను ఆయన సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. తన రాజీనామాకు కారణాలను ఈ లేఖలో ఆయన వివరించారు. తాను కాంగ్రెస్ పార్టీ వ్యక్తిననే గుర్తింపుతో ఇక ఎంతమాత్రం ఉండలేనని, అందుకే జాతీయ స్థాయిలో పార్టీ సంస్థాగత బాధ్యతను తిరస్కరించానని తెలిపారు. ఇదే కారణం వల్ల భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra)లో కూడా పాల్గొనలేదని వివరించారు.
రెండు దశాబ్దాలకుపైగా తాను పార్టీ కోసం పని చేయడానికి తనను ప్రోత్సహించిన విలువలు ప్రస్తుతం లేశమాత్రమైనా కనిపించలేదని, ఇలా చెప్తున్నందుకు నిజంగా చాలా విచారంగా ఉందని తెలిపారు. పార్టీ దేనికి గుర్తుగా ఉందో, దేని కోసం మద్దతుగా నిలుస్తోందో, దానితో తాను ఏకీభవిస్తున్నట్లు మనస్ఫూర్తిగా చెప్పలేనని తెలిపారు. వాటిని తాను ప్రచారం చేయలేనని తెలిపారు. అందుకే తాను జాతీయ స్థాయి సంస్థాగత పదవిని తిరస్కరించానని చెప్పారు.
ఇప్పుడు ఇక నూతన పంథాను నిర్మించుకోవలసిన సమయం వచ్చిందని, కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని తెలిపారు. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని చెప్పారు. ‘‘నేను మరొక పార్టీలో చేరుతానని ఊహాగానాలు రావచ్చు, కానీ నేను ఎవరితోనూ మాట్లాడలేదు. తదుపరి జరిగేదేమిటో నిజంగా నాకు తెలియదు’’ అని పేర్కొన్నారు.
తనకు పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ వివిధ పదవులు ఇచ్చిన సోనియా గాంధీ (Sonia Gandhi)కి ధన్యవాదాలు తెలిపారు.
ఇవి కూడా చదవండి :
China : చైనాను కుదిపేసిన భారీ భూకంపం
PG Medical Student: వెంటిలేటర్‌పైనే ప్రీతికి చికిత్స