Aliens: గ్రహాంతరవాసులు ఉన్నారు!.. కళేబరాల ప్రదర్శన...
ABN , First Publish Date - 2023-09-15T04:26:31+05:30 IST
గ్రహాంతరవాసులు ఉన్నారా..? ఉంటే ఇన్నేళ్లుగా ఎందుకు కనిపించలేదు..? అసలు ఎలా ఉంటారు? గ్రహాంతరవాసులు ఉన్నారు..
మెక్సికోలో వెయ్యేళ్ల నాటి ‘ఏలియన్స్’ మృతదేహాల ప్రదర్శన!
మెక్సికో సిటీ, సెప్టెంబరు 14: గ్రహాంతరవాసులు ఉన్నారా..? ఉంటే ఇన్నేళ్లుగా ఎందుకు కనిపించలేదు..? అసలు ఎలా ఉంటారు? గ్రహాంతరవాసులు ఉన్నారు అని అమెరికా ఇటీవల అధికారికంగా ధ్రువీకరించినప్పటి నుంచీ ప్రజల్లో ఎన్నో ప్రశ్నలు. వాటికి సమాధానమా అన్నట్లుగా గ్రహాంతరవాసులవిగా చెబుతున్న రెండు కళేబరాలను పాత్రికేయుడు, గుర్తుతెలియని ఎగిరే వస్తువుల(యూఎ్‌ఫవో) రంగ నిపుణుడు జేమీ మౌసన్ మెక్సికోలో తాజాగా ప్రదర్శించారు. ‘
‘‘ పెరూలోని కుస్కో నగరంలో గనుల్లో ఇవి బయటపడ్డయి. ఈ రెండు కళేబరాలను ఇక్కడి అటానమస్ నేషనల్ వర్సిటీ ఆఫ్ మెక్సికో పరిశోధకులు అధ్యయనం చేశారు. ఇవి వెయ్యేళ్ల క్రితానికి చెందినవని నిర్ధారించారు. ఆస్మియం వంటి అరుదైన లోహాలు వీటి వేలికి, కొన్ని అవయవాలకు ఉన్నాయి’’ అని జేమీ తెలిపారు. ఈమృతదేహాలకు తీసిన ఎక్స్‌రేలనూ ప్రదర్శించారు. రెండింటిలో ఒక దేహంలో మూడు అండాలు ఉన్నాయని ఆయన వివరించారు. ఈ కార్యక్రమానికి హాజరైనవారిలో పలు రంగాల పరిశోధకులు, మెక్సికో చట్టసభల సభ్యులు, అమెరికాకు చెందిన నిపుణులు ఉన్నారు.