arooq Abdullah: మొహర్రం ఊరేగింపుతో ఓట్లు పడవు.. బీజేపీపై ఫారుక్ అబ్దుల్లా కౌంటర్

ABN , First Publish Date - 2023-07-29T18:53:26+05:30 IST

జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫారుక్ అబ్దుల్లా తాజాగా బీజేపీపై నిప్పులు చెరిగారు. దాదాపు 30 సంవత్సరాల విరామం తర్వాత జమ్ముకశ్మీర్‌లోని...

arooq Abdullah: మొహర్రం ఊరేగింపుతో ఓట్లు పడవు.. బీజేపీపై ఫారుక్ అబ్దుల్లా కౌంటర్

జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫారుక్ అబ్దుల్లా తాజాగా బీజేపీపై నిప్పులు చెరిగారు. దాదాపు 30 సంవత్సరాల విరామం తర్వాత జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో నిర్వహించిన మొహర్రం ఊరేగింపులో ఆయన మాట్లాడుతూ.. మొహర్రం ఊరేగింపుని తిరిగి చేపట్టినంత మాత్రాన ముస్లింల ఓట్లు పడవని, ఆ ఆలోచనని బీజేపీ విరమించుకోవాలని హితవు పలికారు. తాను సీఎంగా ఉన్నప్పుడు ఈ ఉత్సవాలని ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగిందని గుర్తు చేశారు.

ఇప్పుడు మళ్లీ 30 సంవత్సరాల తర్వాత బీజేపీ తన పాలనలో మొహర్రం ఊరేగింపులను చేపట్టిందని, ఫలితంగా తమకు ముస్లిం ఓట్లు పడతాయనే భ్రమలో ఆ పార్టీ ఉందని పారుఖ్ అబ్దుల్లా పేర్కొన్నారు. కానీ.. బీజేపీ ఆశిస్తున్నట్టుగా ఆ పార్టీకి ముస్లిం ఓట్లు ఏమాత్రం పడవని తేల్చి చెప్పేశారు. దేశంలో బీజేపీ మతతత్వ వాతావరణాన్ని సృష్టించిందని ఆరోపించారు. మణిపూర్‌తో పాటు దేశ నలుమూలల జరుగుతున్న హింసకాండ, అఘాయిత్యాలు అంతం అవ్వాలని ప్రార్థిస్తున్నానని అన్నారు. ప్రధాని మోడీ మణిపూర్‌పై త్వరలో పార్లమెంట్‌లో తన ప్రకటన చేస్తారని ఆశిస్తున్నానని ఆశాభావం వ్యక్తం చేశారు.


ఇదిలావుండగా.. జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో తీవ్రవాదం పెరిగిపోవడంతో, మూడు దశాబ్దాల క్రితం మొహర్రం ఊరేగింపుపై ప్రభుత్వం నిషేధం విధించింది. అయినప్పటికీ.. కొన్ని కొన్ని చోట్ల, ముఖ్యంగా షియా ఆధిపత్య ప్రాంతాల్లో ఈ ఊరేగింపులు సాగాయి. ఫలితంగా.. ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత మొహర్రంపై నిషేధం ఎత్తివేయడంతో, అక్కడ చాలా గ్రాండ్‌గా ఊరేగింపు నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే.. ఫారుక్ అబ్దుల్లా బీజేపీని టార్గెట్ చేస్తూ, పైవిధంగా విరుచుకుపడ్డారు.

Updated Date - 2023-07-29T18:53:26+05:30 IST