Fire breaks out: అల్లప్పుజా-కన్నూర్ ఎక్స్‌ప్రెస్ రైలులో అగ్నిప్రమాదం
ABN , First Publish Date - 2023-06-01T09:21:27+05:30 IST
కేరళ రాష్ట్రంలోని అలప్పుజా-కన్నూర్ ఎక్స్‌ప్రెస్ రైలులో గురువారం మంటలు చెలరేగాయి. అలప్పుజా-కన్నూరు ఎగ్జిక్యూటివ్ ఎక్స్‌ప్రెస్ రైలులో గురువారం తెల్లవారుజామున మంటలు చెలరేగడంతో ఒక బోగి దగ్ధమైంది...

కన్నూర్(కేరళ): కేరళ రాష్ట్రంలోని అలప్పుజా-కన్నూర్ ఎక్స్‌ప్రెస్ రైలులో గురువారం మంటలు చెలరేగాయి. అలప్పుజా-కన్నూరు ఎగ్జిక్యూటివ్ ఎక్స్‌ప్రెస్ రైలులో గురువారం తెల్లవారుజామున మంటలు చెలరేగడంతో ఒక బోగి దగ్ధమైంది.(Alappuzha-Kannur Express train) ఇతర కోచ్‌లు సకాలంలో విడిపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని రైల్వే అధికారులు చెప్పారు.(Fire breaks out)రైల్వే స్టేషన్‌లో రైలు ఆగి ఉండగా ఈ ఘటన జరిగింది. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.రెండు నెలల క్రితం కోజికోడ్ నగరంలో రైలు దగ్ధం కేసు జరిగింది.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.పోలీసులు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బిపిసిఎల్) యొక్క సీసీటీవీ ఫుటేజీని శోధించారు అగ్నిప్రమాదానికి ముందు గుర్తు తెలియని వ్యక్తి రైలులోకి ప్రవేశించడాన్ని సీసీటీవీ ఫుటేజీలో చూశారు. ఆ తర్వాత అగ్ని ప్రమాదం జరిగింది.ఏప్రిల్ 2 వతేదీన కోజికోడ్ జిల్లాలో జరిగిన భయంకరమైన రైలు దహనం సంఘటనలో ఒక శిశువుతో సహా ముగ్గురు వ్యక్తులు మరణించారు.