Former Chief Minister: హాసన్‌ టికెట్‌ మా ఇంటి సమస్య

ABN , First Publish Date - 2023-01-30T12:02:55+05:30 IST

హాసన్‌ జిల్లాలో జేడీఎస్‌ పార్టీ టికెట్ల అంశం తారస్థాయికి చేరింది. ఇది తమ ఇంటి సమస్య అని, పరిష్కరించడం కూడా తనకు

Former Chief Minister: హాసన్‌ టికెట్‌ మా ఇంటి సమస్య

- దేవెగౌడ పేరు ప్రస్తావించొద్దు: కుమారస్వామి

బెంగళూరు, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): హాసన్‌ జిల్లాలో జేడీఎస్‌ పార్టీ టికెట్ల అంశం తారస్థాయికి చేరింది. ఇది తమ ఇంటి సమస్య అని, పరిష్కరించడం కూడా తనకు తెలుసని మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి(Former Chief Minister Kumaraswamy) పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ హాసన్‌ టికెట్ల విషయంలో దేవెగౌడ ప్రస్తావన సరికాదన్నారు. రేవణ్ణ కుమారుడు, ఎమ్మెల్సీ సూరజ్‌ శనివారం మీడియాతో మాట్లాడుతూ హాసన్‌ టికెట్ల విషయంలో దేవెగౌడ, రేవణ్ణ నిర్ణయమే అంతిమమన్నారు. రేవణ్ణ భార్య భవాని పోటీ చేసేందుకు సిద్ధం కావడమే ఇక్కడ వివాదమవుతోంది. ఆమెకు టికెట్‌ కేటాయించేందుకు కుమారస్వామి వెనుకడుగు వేస్తున్నారు. రేవణ్ణ, భవాని కుమారుడు ఎమ్మెల్సీ సూరజ్‌ నేరుగా చిన్నాన్న కుమారస్వామిని ఉద్దేశించి ఘాటుగానే వ్యాఖ్యానించారు. దీంతో వివాదం తారస్థాయికి చేరుతోంది. అయితే రేవణ్ణ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ టికెట్ల విషయంలో కుమారస్వామిదే అంతిమ నిర్ణయమని, అందుకు ఎవరైనా కట్టుబడి ఉండాల్సిందే అన్నారు. రేవణ్ణ పరోక్షంగా కుమారుడు సూరజ్‌ వ్యాఖ్యలను తిప్పికొట్టినట్టయింది. వివాదం ఎక్కడిదాకా సాగుతుందనేది వేచి చూడాల్సిందే.

Updated Date - 2023-01-30T12:02:56+05:30 IST