Governor: గవర్నర్‌ సంచలన వాఖ్యలు.. ‘దారుణ నిజం బయటపడింది’

ABN , First Publish Date - 2023-05-23T10:45:49+05:30 IST

రాష్ట్ర గవర్నర్ ఆర్ ఎన్ రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. అవినీతి, తీవ్రవాదం నేపథ్యంలో తెరకెక్కిన ‘ది కేరళ స్టోరీ’ చిత్రానికి మద్దతు, వ్యతిరేక

Governor: గవర్నర్‌ సంచలన వాఖ్యలు.. ‘దారుణ నిజం బయటపడింది’

పెరంబూర్‌(చెన్నై): ‘ది కేరళ స్టోరీ’ చిత్రాన్ని గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి(Governor RN Ravi) ప్రశంసించారు. అవినీతి, తీవ్రవాదం నేపథ్యంలో తెరకెక్కిన ‘ది కేరళ స్టోరీ’ చిత్రానికి మద్దతు, వ్యతిరేకత రెండూ వచ్చాయి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఈ చిత్రానికి పన్ను మినహాయింపు ఇవ్వగా, పశ్చిమబెంగాల్‌, తమిళనాడు రాష్ట్రాల్లో ఈ సినిమాపై వ్యతిరేకత వ్యక్తమైంది. ముఖ్యంగా, తమిళనాడులో ఈ చిత్రానికి పెద్దగా ఆదరణ లభించలేదని ధియేటర్‌ యజమానులు చిత్ర ప్రదర్శనకు నిరాకరించారు. ఈ నేపథ్యంలో, గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి ఆదివారం రాత్రి స్థానిక నుంగంబాక్కంలోని ఓ ప్రైవేటు ప్రివ్యూ థియేటర్‌లో భార్యతో కలసి ‘ది కేరళ స్టోరీ’ చిత్రాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ... క్రూరమైన నిజాన్ని బయటపెట్టిన చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు.

Updated Date - 2023-05-23T10:45:49+05:30 IST