Ahmedabad: ‘పఠాన్’ సినిమా ప్రమోషన్‌పై హిందూ గ్రూప్ ఆగ్రహం...మాల్ ధ్వంసం
ABN , First Publish Date - 2023-01-05T07:46:28+05:30 IST
‘పఠాన్’ సినిమా ప్రమోషన్ పై హిందూ గ్రూప్ భజరంగ్ దళ్ కార్యకర్తలు ఆగ్రహం
అహ్మదాబాద్(గుజరాత్): బాలీవుడ్ సినీ నటులు షారుఖ్ ఖాన్, దీపికా పదుకొనే నటించిన ‘పఠాన్’ సినిమా ప్రమోషన్ పై హిందూ గ్రూప్ భజరాజ్ దళ్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.(Hindu group) భజరాజ్ దళ్ కార్యకర్తలు బుధవారం అహ్మదాబాద్‌లోని ఒక మాల్‌ను ధ్వంసం చేశారు. జనవరి 25వతేదీన విడుదల కానున్న ఈ సినిమా పోస్టర్లను కార్యకర్తలు చించివేశారు.(SRK, Deepika Padukone)సినిమా విడుదలకు ముందు అహ్మదాబాద్‌లోని అల్ఫావన్ మాల్‌లో హిందూ గ్రూపు కార్యకర్తలు హంగామా సృష్టించారు.
సినిమా పోస్టర్లను చించివేయడమే కాకుండా, థియేటర్లలో పఠాన్ సినిమాను విడుదల చేయవద్దని వారు హెచ్చరించారు.షారుఖ్ ఖాన్, దీపికా పదుకొనే,జాన్ అబ్రహం నటించిన ‘పఠాన్’ చిత్రం బేషరమ్ రంగ్ పాట విడుదలైనప్పటి నుంచి పలు వివాదాలు రాజుకున్నాయి.షారుఖ్ ఖాన్ దిష్టిబొమ్మను దహనం చేశారు.హిందువుల మనోభావాలను దెబ్బతీసినందుకు పఠాన్ సినిమాను నిషేధించాలని హిందూ గ్రూప్ కార్యకర్తలు పిలుపునిచ్చారు.