Sikkim : సిక్కింలో విరిగిపడిన మంచుకొండ.. శిథిలాల క్రింద 20 మంది?...
ABN , First Publish Date - 2023-04-04T16:12:59+05:30 IST
సిక్కిం (Sikkim)లోని ప్రముఖ పర్యటక కేంద్రం వద్ద మంగళవారం మధ్యాహ్నం మంచు కొండ విరిగిపడింది.
న్యూఢిల్లీ : సిక్కిం (Sikkim)లోని ప్రముఖ పర్యటక కేంద్రం వద్ద మంగళవారం మధ్యాహ్నం మంచు కొండ విరిగిపడింది. ఈ శిథిలాల క్రింద సుమారు 20 మంది చిక్కుకున్నట్లు ప్రాథమిక సమాచారం. తూర్పు సిక్కింలోని 14వ మైలు రాయికి సమీపంలో, గ్యాంగ్టక్-నాథులాను కలిపే జవహర్లాల్ నెహ్రూ రోడ్డులో ఈ దుర్ఘటన జరిగింది.
సంఘటన స్థలానికి హుటాహుటిన బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ (Border Road Organisation-BRO) బృందాలు, సిక్కిం పోలీసులు, ట్రావెల్ ఏజెంట్స్ అసోసియేషన్, టూరిజం డిపార్ట్‌మెంట్ అధికారులు చేరుకుని, సహాయక కార్యక్రమాలను ప్రారంభించారు. గాయపడినవారిని సిక్కిం రాజధాని నగరం గ్యాంగ్టక్‌లోని ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం 22 మంది పర్యటకులను కాపాడారు. రోడ్డుపైన పడిన మంచును తొలగించి దాదాపు 350 మందిని కాపాడారు. సుమారు 80 వాహనాలను వెలికి తీశారు. సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇవి కూడా చదవండి :
Karnataka assembly polls: కర్ణాటకలో బీజేపీ గెలిచి తీరాల్సిందే... ఎందుకంటే?
Karnataka Congress : కర్ణాటక కాంగ్రెస్‌లో సిద్ధూ, డీకే వర్గాల పోటాపోటీ