Minister: ముఖ్యమంత్రి కుమారుడు, మంత్రి ఉదయనిధి ఏమన్నారో తెలుసా.. టీచర్లకు మా ప్రభుత్వం..

ABN , First Publish Date - 2023-05-31T11:03:06+05:30 IST

టీచర్లకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర యువజన సంక్షేమం, క్రీడాభివృద్ధి శాఖ మంత్రి ఉదయనిధి(Minister Udayanidhi)

Minister: ముఖ్యమంత్రి కుమారుడు, మంత్రి ఉదయనిధి ఏమన్నారో తెలుసా.. టీచర్లకు మా ప్రభుత్వం..

ప్యారీస్‌(చెన్నై): టీచర్లకు డీఎంకే ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర యువజన సంక్షేమం, క్రీడాభివృద్ధి శాఖ మంత్రి ఉదయనిధి(Minister Udayanidhi) పేర్కొన్నారు. స్థానిక కోట్టూర్‌పురంలో ఉన్న అన్నా సెంటినరీ లైబ్రరీ ప్రాంగణంలో తమిళనాడు టీచర్ల మున్నేట్ర సంఘం వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర మంత్రులు పొన్ముడి, అన్బిల్‌ మహేశ్‌ పొయ్యామొళి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీచర్లకు, విద్యార్థులకు మంత్రులు బహుమతులు అందజేసి అభినందించారు. అనంతరం మంత్రి ఉదయనిధి మాట్లాడుతూ... టీచర్లను గౌరవించే పార్టీ డీఎంకే అని, 53 వేలమంది గౌరవ వేతనం పొందే టీచర్లను 2006 సంవత్సరంలో పర్మినెంట్‌ చేసింది దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధేనని తెలిపారు. గత అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో 652 మంది టీచర్లపై నమోదు చేసిన కేసులను ముఖ్యమంత్రి స్టాలిన్‌(Chief Minister Stalin) రద్దు చేశారని గుర్తు చేశారు. టీచర్ల ఉద్యోగాల భర్తీ పారదర్శకంగా ఉండేలా కౌన్సెలింగ్‌ విధానం ద్వారా 30 వేలమంది మందికి ఉద్యోగాలు ఇవ్వడంతో పాటు బదిలీలు కూడా చేశామన్నారు. టీచర్‌ అర్హత పరీక్షల్లో ఉత్తీర్ణులైతే జీవితాంతం అది చెల్లుతుందని ముఖ్యమంత్రి స్టాలిన్‌ ప్రకటించారని తెలిపారు. టెన్త్‌, ప్లస్‌టూ పబ్లిక్‌ పరీక్షల్లో అధిక మార్కులు సాధించే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల సంక్షేమం కోసం పథకాలను ప్రవేశపెట్టడంతో పాటు టీచర్ల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.

kkkk.jpg

Updated Date - 2023-05-31T11:28:10+05:30 IST