Share News

Diwali gift Women soldiers: సాయుధ బలగాల్లో మహిళా సోల్జర్లకు మోదీ సర్కార్ దీపావళి గిఫ్ట్

ABN , First Publish Date - 2023-11-05T16:56:30+05:30 IST

భారత సాయుధ బలగాల్లో పనిచేసే మహిళా సోల్జర్లకు కేంద్ర దీపావళి గిఫ్ట్ ప్రకటించింది. ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్‌లో సేవలందిస్తున్న మహిళా సోర్జర్లు, సైలర్లు, ఎయిర్ వారియర్లకు మెటర్నిటీ, చైల్డ్ కేర్, చైల్డ్ అడాప్షన్ లీవులను మంజూరు చేయాలనే అసాధారణ ప్రతిపాదనకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు.

Diwali gift Women soldiers: సాయుధ బలగాల్లో మహిళా సోల్జర్లకు మోదీ సర్కార్ దీపావళి గిఫ్ట్

న్యూఢిల్లీ: భారత సాయుధ బలగాల్లో (Indian Armed Forces) పనిచేసే మహిళా సోల్జర్ల (Women soldiers)కు కేంద్ర దీపావళి గిఫ్ట్ ప్రకటించింది. ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్‌లో సేవలందిస్తున్న మహిళా సోర్జర్లు, సైలర్లు, ఎయిర్ వారియర్లకు మెటర్నిటీ, చైల్డ్ కేర్, చైల్డ్ అడాప్షన్ లీవులను మంజూరు చేయాలనే అసాధారణ ప్రతిపాదనకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath singh) గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. కొత్త రూల్స్ ప్రకారం అన్ని రాంకుల మహిళా సిబ్బందికి తమ ఆఫీసర్లతో సమానంగా ఈ ప్రయోజనాలు వర్తిస్తాయి. కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయం ద్వారా మహిళా సోల్జర్లలో వృత్తి నైపుణ్యతలు పెరగడంతో పాటు, ఇటు వృత్తి, అటు కుటుంబ జీవనం మధ్య సమతుల్యత ఏర్పడనుంది.


రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తాజా నిర్ణయం మిలటరీలోని మహిళందరికీ వర్తిస్తుందని, ఆఫీసర్ అయినా, ఇతర ఏ ర్యాంక్ వారికైనా ఇవి సమానంగా వర్తిస్తాయని రక్షణ శాఖ కార్యాలయం ఒక ట్వీట్‌లో తెలిపింది.

Updated Date - 2023-11-05T16:58:19+05:30 IST