NIA Raids : ఆరు రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు

ABN , First Publish Date - 2023-05-17T12:50:39+05:30 IST

మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, ఉగ్రవాదం, గ్యాంగ్‌స్టర్ల కేసుల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) బుధవారం ఉదయం ఆరు రాష్ట్రాల్లో సోదాలు ప్రారంభించింది.

NIA Raids : ఆరు రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు

న్యూఢిల్లీ : మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, ఉగ్రవాదం, గ్యాంగ్‌స్టర్ల కేసుల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) బుధవారం ఉదయం ఆరు రాష్ట్రాల్లో సోదాలు ప్రారంభించింది. హర్యానా, పంజాబ్, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, మధ్య ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో దాదాపు 100కుపైగా చోట్ల ఈ సోదాలు జరుగుతున్నట్లు ఎన్ఐఏ అధికారులు చెప్పారు.

ఉగ్రవాద సంస్థలు, విదేశాల్లోని వాటి సానుభూతిపరులు కలిసి వ్యవస్థీకృత క్రిమినల్ గ్యాంగులుగా ఏర్పడ్డారని, ఈశాన్య రాష్ట్రాల్లో కొందరిని లక్ష్యంగా చేసుకుని హత్యలు, హింసాత్మక చర్యలకు పాల్పడుతున్నారని సమాచారం రావడంతో గత ఏడాది ఎన్ఐఏ కేసులను నమోదు చేసింది. వీరు ఆయుధాలు, మందుగుండు, పేలుడు పదార్థాలు, ఐఈడీలు వంటివాటిని కూడా అక్రమంగా రవాణా చేస్తున్నట్లు వెల్లడైంది. వీరికి విస్తృతమైన అంతర్రాష్ట్ర నెట్‌వర్క్ ఉన్నట్లు వెల్లడైంది.

ఎన్ఐఏ ఇప్పటి వరకు 19 మందిని అరెస్ట్ చేసింది. వీరంతా వేర్వేరు క్రిమినల్ గ్యాంగ్‌లకు చెందినవారు. ఈ నెట్‌వర్క్‌తో సంబంధాలుగల ఇద్దరు ఆయుధాల సరఫరాదారులు, ఓ ఫైనాన్షియర్ కూడా అరెస్టయ్యారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం ప్రకారం వీరిని అరెస్ట్ చేశారు.

కెనడాకు చెందిన అర్ష్ డల్లాను ఉగ్రవాదిగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ ఏడాది జనవరి 9న ప్రకటించింది.

ఇవి కూడా చదవండి :

Gujarat CM : గుజరాత్ ముఖ్యమంత్రి నిరాడంబరత.. ఇలాంటి నేత కదా కావాలి..

India Vs EU : రష్యన్ చమురు రీసెల్లింగ్.. యూరోపియన్ దౌత్యవేత్తకు ఘాటు జవాబిచ్చిన జైశంకర్..

Updated Date - 2023-05-17T12:50:39+05:30 IST