Rs.10 coins: రూ.10 నాణేలు తిరస్కరించవద్దు...

ABN , First Publish Date - 2023-08-31T11:26:38+05:30 IST

రూ.10 నాణేలు చలామణీలో ఉన్నాయని, వాటిపై ఎలాంటి పుకార్లు నమ్మవద్దని డీసీ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా(DC Prashant Kumar Mishra)

Rs.10 coins: రూ.10 నాణేలు తిరస్కరించవద్దు...

బళ్లారి(బెంగళూరు): రూ.10 నాణేలు చలామణీలో ఉన్నాయని, వాటిపై ఎలాంటి పుకార్లు నమ్మవద్దని డీసీ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా(DC Prashant Kumar Mishra) ఒక ప్రకటనలో వెల్లడించారు. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(Reserve Bank of India) ప్రజల ప్రయోజనార్థం వాటిని విడుదల చేసిందని ప్రజలు బ్యాంకు సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. దుకాణాలు, వ్యాపారులు, సామాన్య ప్రజలు తీసుకోవాలని కోరారు. లావాదేవీలకు ఎవరైనా వ్యతిరేకిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునే హక్కు ప్రభుత్వానికి ఉందన్నారు. బ్యాంకులు కూడా సహకరించాలన్నారు.

Updated Date - 2023-08-31T11:26:39+05:30 IST