Rahul Membership: సభ్యత్వం రద్దు చేసినప్పుడు ఉన్న స్పీడ్ ఇప్పుడేమైంది?.. కేంద్రాన్ని నిలదీసిన కాంగ్రెస్

ABN , First Publish Date - 2023-08-05T17:12:22+05:30 IST

రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వాన్నిపునరుద్ధరించే విషయంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం చేస్తున్న జాప్యాన్ని కాంగ్రెస్ పార్టీ తప్పు పట్టింది. రాహుల్ సభ్యత్వాన్ని రద్దు చూసినప్పుడు చూపించిన స్పీడు.. సభ్యత్వం పునరుద్ధరించే విషయంలో ఎందుకు చూపించడం లేదని ప్రశ్నించింది.

Rahul Membership: సభ్యత్వం రద్దు చేసినప్పుడు ఉన్న స్పీడ్ ఇప్పుడేమైంది?.. కేంద్రాన్ని నిలదీసిన కాంగ్రెస్

న్యూఢిల్లీ: రాహుల్ గాంధీ (Rahul Gandhi) పార్లమెంటు సభ్యత్వాన్ని (Membership) పునరుద్ధరించే (Restoration) విషయంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం చేస్తున్న జాప్యాన్ని (Delay) కాంగ్రెస్ పార్టీ (Congress) తప్పు పట్టింది. రాహుల్ సభ్యత్వాన్ని రద్దు చూసినప్పుడు చూపించిన స్పీడు.. సభ్యత్వం పునరుద్ధరించే విషయంలో ఎందుకు చూపించడం లేదని ప్రశ్నించింది. ఇలాంటి జాప్యపు ఎత్తుగడలు సరికాదని లోక్‌సభలో విపక్ష కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి (Adhir ranjan chowdhury) అన్నారు.


''రాహుల్ గాంధికి విధించిన శిక్షపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. దాని అర్ధం ఏమిటి? పార్లమెంటు కార్యక్రమాల్లో ఆయనకు తిరిగి పాల్గొనే అవకాశం కల్పించినట్టే. రాహుల్‌పై అనర్హత వేటు వేసేందుకు చూపించిన స్పీడునే ఇప్పుడు సభ్యత్వం పునరుద్ధరించే విషయంలోనూ చూపించాల్సి ఉంటుంది'' అని అన్నారు. స్పీకర్‌ను తాను శుక్రవారం రాత్రి కులుసుకున్నానని, ఆయన శనివారం రమ్మన్నారని, ఇవాళ కలిసినప్పుడు ఈ అంశాన్ని ఆయన సెక్రటరీ జనరల్‌కు రిఫర్ చేసి సంబంధిత డాక్యుమెంట్లను కార్యాలయంలో సమర్పించాలని చెప్పారని తెలిపారు. తాను సెక్రరటరీ జనరల్‌ను కలిశానని, తన కార్యాలయానికి సెలవు అయినందున స్పీకర్‌కు లెటర్ సమర్పించమని ఆయన చెప్పారని, లెటర్‌పై వాళ్లు సంతకం చేసినప్పటికీ స్టాంప్ వేయలేదని అధీర్ రంజన్ తెలిపారు. సభ సజావుగా సాగేందుకు, రాహుల్ తిరిగి సభకు వచ్చేందుకు స్పీకర్ తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. రాహుల్‌కు కోర్టు స్టే ఇచ్చినప్పుడు, ఆయన తిరిగి సభలోకి అడుగుపెట్టేందుకు ఎలాంటి అవరోధాలు లేకుండా చూడాలని స్పీకర్‌కు అధీర్ రంజన్ విజ్ఞప్తి చేశారు. కాగా, మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై మంగళవారం నంచి చర్చ ప్రారంభం కానున్న నేపథ్యంలో రాహుల్‌ సభ్యత్వాన్ని తక్షణం పునరుద్ధరిస్తే ఆయన ఈ చర్చలో పాల్గొనే వీలుంటుంది.

Updated Date - 2023-08-05T17:12:22+05:30 IST