Share News

రౌడీషీటర్లపై ప్రత్యేక నిఘా ఉంచాలి

ABN , Publish Date - Mar 21 , 2025 | 11:47 PM

రౌడీయిజం తగ్గించే దిశగా రౌడీషీటర్లపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఎస్పీ అధిరాజ్‌సింగ్‌ రాణా అన్నారు. శుక్రవారం నంద్యాల జిల్లా పోలీసు కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో జిల్లా పోలీసు అధికారులతో ఎస్పీ సమీక్షా సమావేశం నిర్వహించారు

రౌడీషీటర్లపై ప్రత్యేక నిఘా ఉంచాలి
మాట్లాడుతున్న ఎస్పీ అధిరాజ్‌సింగ్‌ రాణా

మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి

సీసీ కెమెరాల ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పించాలి: ఎస్పీ

నంద్యాల క్రైం, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): రౌడీయిజం తగ్గించే దిశగా రౌడీషీటర్లపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఎస్పీ అధిరాజ్‌సింగ్‌ రాణా అన్నారు. శుక్రవారం నంద్యాల జిల్లా పోలీసు కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో జిల్లా పోలీసు అధికారులతో ఎస్పీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై సత్వరమే స్పందించి చర్యలు తీసుకో వాలని ఆదేశించారు. సీసీ కెమెరాలపై ప్రజలలో అవగాహన కల్పించాలన్నారు. తప్పిపోయిన బాలురు, బాలికల కేసులలో ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఆచూకీ తెలుసుకోవాలని సూచించారు. స్కూళ్లు, కళాశాలలు, హాస్టళ్లలో విద్యార్థులకు ప్రస్తుతం సమాజంలో జరిగే నేరాలపై అవగాహన కల్పించాలన్నారు. హత్యలు, అనుమానాస్పద మృతి కేసుల్లో త్వరితగతిన పురోగతి సాధించాలని సూచించారు. గ్రేవ్‌ కేసులు, యూఐ కేసులు, పీటీ కేసులు, మర్డర్‌, సైబర్‌ క్రైమ్‌ కేసులు, పోక్సో కేసులు, మిస్సింగ్‌ కేసులు, ఎస్సీ, ఎస్టీ కేసుల దర్యాప్తు పురోగతిపై ప్రత్యేక దృష్టి ఉంచాలని, నేరం చేసిన వారికి శిక్షపడేలా ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని ఆదేశించారు. ఎన్‌డీపీఎస్‌, పోక్సో కేసుల్లో నిందితులపై నిఘా ఉంచి అవసరమైతే రౌడీషీట్‌ ఓపెన్‌ చేయాలని పేర్కొన్నారు. విజిబుల్‌ పోలీసింగ్‌లో భాగంగా తనిఖీలు నిర్వహిస్తూ గంజాయి, మద్యం, పీడీఎస్‌ రైస్‌ అక్రమ రవాణా జరుగకుండా నిరోధించాలని, బహిరంగ మద్యపానం, డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌, మైనర్‌ డ్రైవింగ్‌పై చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సమావేశంలో ఏఎస్పీ మంద జావళి, అడిషనల్‌ ఎస్పీ అడ్మిన్‌ యుగంధర్‌బాబు, డీఎస్పీలు రామాంజినాయక్‌, ప్రమోద్‌, ట్రైనీ డీఎస్పీ రాజసింహారెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Mar 21 , 2025 | 11:47 PM