Special train: తెలుగు రాష్ట్రాల మీదుగా మరో ప్రత్యేక రైలు
ABN , First Publish Date - 2023-04-23T12:48:58+05:30 IST
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మీదుగా మరో ప్రత్యేక రైలును రైల్వేశాఖ ఏర్పాటు చేసింది.
గుంతకల్లు/బెంగళూరు: ప్రయాణికుల రద్దీ నియంత్రణకుగానూ మైసూరు- గౌహతి(Mysore-Guwahati) (వయా గుంతకల్లు) మధ్య ఓ సింగిల్ ట్రిప్ స్పెషల్ రైలును నడప నున్నట్లు రైల్వే అధికారులు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ రైలు (నెం. 06203) మైసూరులో 23వ తేదీ ఆదివారం ఉదయం 4-20 గంటలకు బయ లుదేరి అదేరోజు మధ్యాహ్నం 1-30 గంటలకు గుంతకల్లుకు వచ్చి, 25వ తేదీ రాత్రి 9-45 గంటలకు గౌహతికి చేరుకుంటుందన్నారు. ఈ రైలు బెంగళూరు, బెంగళూరు కంటోన్మెంటు, యల్హంక, ధర్మవరం, గుంతకల్లు, ఆదోని, మంత్రాలయం రోడ్డు(Guntakallu, Adoni, Mantralayam Road), రాయచూరు, వికారాబాద్, లింగంపల్లి, సికింద్రాబాద్, నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, ఏలూరు(Lingampally, Secunderabad, Nalgonda, Miryalaguda, Guntur, Vijayawada, Eluru), రాజమండ్రి, సామర్లకోట, తుని, దువ్వాడ, కొత్తవలస, విజయనగరం, చీపురుపల్లి, శ్రీకాకుళం రోడ్డు, పలాస, బ్రహ్మపురం, కుద్ర రోడ్, భువనేశ్వర్, కుట్టక్, బాద్రక్, బాలాసోర్, ఖరగ్‌పూర్, రాంపుర్‌హట్, మల్డాటౌన్, బార్సోయి, కిషన్‌గంజ్, న్యూ జల్‌పాయ్ గురి, న్యూ కూచ్ బేహర్, న్యూ ఆలీపూర్ ద్వార్, న్యూ బొంగాయ్‌గావ్, రంగియా, కామాక్య స్టేషన్ల మీదుగా వెళ్తుందన్నారు.