Shri Krishna Janmabhoomi : శ్రీకృష్ణ జన్మభూమి కేసు అలహాబాద్ హైకోర్టుకు బదిలీ
ABN , First Publish Date - 2023-05-26T17:34:57+05:30 IST
ఉత్తర ప్రదేశ్‌లోని మథురలో ఉన్న శ్రీకృష్ణ జన్మభూమి వివాదంపై కేసు అలహాబాద్ హైకోర్టుకు బదిలీ అయింది.
న్యూఢిల్లీ : ఉత్తర ప్రదేశ్‌లోని మథురలో ఉన్న శ్రీకృష్ణ జన్మభూమి (Shri Krishna Janmabhoomi) వివాదంపై కేసు అలహాబాద్ హైకోర్టుకు బదిలీ అయింది. ప్రస్తుతం ఈ కేసు మథుర జిల్లా కోర్టు విచారణలో ఉంది. హిందూ పక్షం కోరిన మీదట హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. మే 3న హైకోర్టు ఈ తీర్పును రిజర్వు చేసి, శుక్రవారం ప్రకటించింది.
శ్రీకృష్ణ జన్మభూమి స్థలంలో షాహీ మసీదు ఈద్గా ఉంది. దీనిపై సర్వ హక్కులు తమకే ఉన్నాయని హిందూ పక్షం వాదించింది. ఈ కేసుకు జాతీయ స్థాయి ప్రాధాన్యం ఉందని, అందువల్ల దీనిపై విచారణ హైకోర్టులోనే జరగాలని తెలిపింది.
భగవాన్ శ్రీకృష్ణ విరాజ్‌మాన్ తరపున రంజనా అగ్నిహోత్రి, మరో ఏడుగురు ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ కేసులో ప్రతివాదులు... షాహీ మసీదు ఈద్గా నిర్వహణ కమిటీ, శ్రీకృష్ణ జన్మభూమి ట్రస్ట్, కాట్ర కేశవ్ దేవ్, శ్రీకృష్ణ జన్మస్థాన్ సేవా సంస్థాన్.
శ్రీకృష్ణ దేవాలయానికి పక్కనే ఉన్న ఈద్గాపై హిందువులకే హక్కులు ఉన్నాయని పిటిషనర్లు వాదించారు. హిందూ దేవాలయాలను కూలగొట్టి, ఈద్గాను నిర్మించారని తెలిపారు. ఇటువంటి నిర్మాణం మసీదు కాబోదని, విధ్వంసం చేసి, మసీదును నిర్మించడం వక్ఫ్ కాబోదని తెలిపారు. ఈ భూమిని మసీదు నిర్మాణం కోసం ఎవరూ ఇవ్వలేదని తెలిపారు.
ఇవి కూడా చదవండి :
Rahul Gandhi : పాస్‌పోర్ట్ పొందేందుకు రాహుల్ గాంధీకి ఢిల్లీ కోర్టు అనుమతి
New Parliament Building : కొత్త పార్లమెంటు భవనం ప్రారంభోత్సవంపై పిల్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు